విజ‌యోత్స‌వాలు… ఆడంబరాలు వ‌ద్దు…

-సంయ‌మ‌నంతో ఉందాం
-ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ను అంతా గౌర‌వించాలి
-కౌంటింగ్ స‌మ‌యంలో కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలి
-చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని 

చిల‌క‌లూరిపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ స‌మ‌యంలో కౌంటింగ్ సెంట‌ర్ల వద్ద పార్టీ నాయ‌కులు, ఏజెంట్లు సంయ‌మ‌నంతో ఉండాల‌ని చిల‌క‌లూరిపేట శాస‌నస‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. స్థానిక త‌న కార్యాల‌యంలో శుక్ర‌వారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌తో ఎమ్మెల్యే ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ఆదివారం జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మానికి అభ్య‌ర్థులంతా స‌మాయ‌త్తం కావాల‌ని చెప్పారు. శ‌నివారం ఉద‌యానికల్లా ఏజెంట్ల జాబితా పూర్త‌వ్వాల‌న్నారు. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల‌క‌ల్లా నాయ‌కులు, ఏజెంట్లు, అభ్య‌ర్థులంతా కౌటింగ్ కేంద్రానికి చేరుకోవాల‌ని సూచించారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో అభ్య‌ర్థులు, ఏజెంట్లు సంయ‌మ‌నంతో ఉండాల‌ని తెలిపారు. దాదాపు అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తార‌ని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. భౌతిక దూరం పాటించాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచించిన నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని తెలిపారు. విజ‌యోత్స‌వాలకు దూరంగా ఉండాల‌ని నాయ‌కుల‌కు సూచించారు. ఈ విష‌యంలో ఎస్ఈసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు మండ‌లాల జెడ్పీటీసీ స‌భ్యులు కోడె సుధ‌రాణి, కాట్ర‌గ‌డ్డ మ‌స్తాన్‌రావు,ముక్తా వాసు, నాదెండ్ల‌, య‌డ్ల‌పాడు మండ‌లాల పార్టీ అధ్య‌క్షులు దేవినేని శంకరరావు, గొంటు శ్రీనివాస‌రెడ్డి, క‌ల్లూరి బుజ్జి, పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు,పార్టీ నాయ‌కులు నాగ‌భైరు వెంక‌ట్‌, పెడ‌వ‌లి చిన‌బాబు, పెడ‌వ‌లి రాజ‌శేఖ‌ర్‌, కిలారు ర‌వీంద్ర‌, దండా నాగేశ్వ‌ర‌రావు, మ‌ద్దూరి కోటిరెడ్డి, ర‌త్త‌య్య‌, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *