విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే చక్కటి ఫలితాలు కూడా వస్తాయని నిరూపించారని కలెక్టర్ జె.నివాస్ ఇటీవల జరిగిన కౌంటింగ్ లో పాల్గొన్న అధికారులకు అభినందనలు తెలిపారు. మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పూర్తయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ కొంటింగ్ లో ప్రణాళికాబద్ధంగా పనిచేసినందువల్లే అతితక్కువ సమయం ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు రాకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయగలిగారన్నారు. అదే రీతిలో గృహనిర్మాణాలు, రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్లు తదితర ఉపాధి హామీ నిర్మాణాలు కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. లబ్దిదారులను చైతన్య పరచడం అలాగే గృహనిర్మాణాలకు సామాగ్రి లబ్దిదారులతో అనుసంధానం చేయడంలో మండల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు చేయాలన్నారు. ఒకే రోజులో ఏదీ సాధ్యం కాదని, దానిని గట్టిగా తాను నమ్ముతున్నానని అదే ముందుస్తు ప్రణాళికతో ముందుకు వెళితే అసాధ్యపనులు కూడా సుసాధ్యమవుతాయని ఆయన మరోసారి అధికారులకు గుర్తు చేశారు. గ్రామ సచివాలయాల్లో నిర్దిష్ట కాల పరిమితికి మించి ఎలాంటి దరఖాస్తులు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. 24 గంటలు. 48 గంటల కాల పరిమితి ఉన్న సమస్యలు సుమారు 800 పరిశీలనకు గ్రామ సచివాలయల్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే సచివాలయ అడ్మిన్లు పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు. కొన్ని సమస్యలైతే కంపూటర్లలో లాగిన్ కాలేదని వాటిని వెంటనే తెరచి సత్వర పరిష్కారం చేయాలన్నారు. సచివాలయ సేవలను నిర్దిష్ట కాల పరిమితిలో సత్వర పరిష్కారం చేయాలన్నారు.
వైయస్ఆర్ బీమా…
వైయస్ఆర్ బీమా పథకం కింద చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 979 మరణాలు సంభవిస్తే అందులో 858 దరఖాస్తులు సచివాలయాల ద్వారా పరిశీలన జరిగిందన్నారు. మిగిలిన 121 క్లైమ్ లను త్వరితగతిన పరిశీలన చేసి అప్లోడ్ చేయమని ఆదేశించారు.
పింఛన్ల పరిశీలన వేగవంతం చేయండి…
జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం 26.756 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే అందులో 7,610 దరఖాస్తులు మాత్రమే ఇంతవరకూ పరిశీలించారన్నారు. మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు చొరవ చూపి మిగిలిని దరఖాస్తులను పరిశీలించేలా చూడాలన్నారు. జిల్లాలో పింఛన్ల కు సంబంధించి సందేహాస్పద కేసుల పునఃపరిశీలన వేగవంతం చేయాలన్నారు. వివిధ కారణాలతో ఆగిన పింఛన్లను క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి సంబంధిత వివరాలు సమర్పించాలన్నారు. అయితే ఆ దరఖాస్తులు పరిశీలించి ప్రత్యేకంగా రూపొందించిన ఎలిజిబులిటీ యాప్లో వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా అప్లోడ్ చేయించాలని చెప్పారు.
డిజిటల్ పేమెంట్స్…
రైతు భరోసా, వాహన మిత్ర, వైయస్ఆర్ చేయూత, కాపునేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాల లబ్దిదారులకు సంబందించి డిజిటల్ పేమెంట్ ఎకనాలెడ్జ్ మెంట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ గృహనిర్మాణం నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ జెసి ఆసరా మోహన్ కుమారు. హౌసింగ్ పీడి రామచంద్రన్ తదితర అధికారులు పాల్గొన్నారు.