అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి వైయస్సార్ ఫించన్ కానుక అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో పంచాతీరాజ్ శాఖకు సంబంధంచి సెర్ప్ అధికారులతో సెర్ప్ అధికారులతో వివిధ పధకాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెర్ప్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హత కలిగిన ప్రతి వ్యక్తికీ వైయస్సార్ ఫించను కానుక అందాలని అలాగే అర్హతలేని వారికి ఫించన్ ఇవ్వరాదని అదే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగా అధికారులు తగిన చర్యులు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.జెసి డెవలప్మెంట్,పిడి ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈసమావేశంలో సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైయస్సార్ పెన్షన్ కానుక,వైయస్సార్ చేయూత,వైయస్సార్ బీమా,ఉన్నతి,సున్నా వడ్డి, ఆసరా తదితర పధకాల ప్రగతిని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజాశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జగనన్న పల్లెవెలుగు-ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్టుపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష…
రాష్ట్రంలో జగనన్న పల్లెవెలుగు కార్యక్రంలో భాగంగా ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్టుపై మంగళవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమీక్షించారు.ఈసమావేశాల్లో ఈసమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,పంచాతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజాశంకర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.