Breaking News

విజయవాడ, బెంజి సర్కిల్‌లో మొదటి ‘విష్‌ గ్రిల్‌’ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ బార్బెక్యూ రెస్టారెంట్‌ల గొలుసుకట్టు అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబి) తన 45 వ రెస్టారెంట్‌ను 2వ అంతస్థు, 40-1-68/69, వజ్ర కమర్షియల్‌ కాంప్లెక్స్‌, బెంజి సర్కిల్‌, ఎమ్‌జి రోడ్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌- 520010 చిరునామాలో ప్రారంభించింది. దీనితో వైజాగ్‌ అవుట్‌లెట్‌ తరువాత అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబి) ఆంధ్రప్రదేశ్‌లో తన 2వ ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లయ్యింది. అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ కస్టమర్‌-ప్రాముఖ్యత గురించి మాట్లాడటమే కాకుండా తన సామాజిక బాధ్యతను కూడా అర్థం చేసుకుంటుంది మరియు ఎల్లప్పుడూ సమాజానికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. బ్రాండ్‌ తన 45వ అవుట్‌లెట్‌ ప్రారంభం సందర్బంగా, విజయవాడలో కేర్‌ & షేర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ యొక్క చొరవతో డాడీస్‌ హోమ్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకుంది. కేర్‌ & షేర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, విజయవాడ (ఆంధ్రప్రదేశ్‌, ఇండియా) భారత ప్రభుత్వం, హోమ్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ వద్ద నమోదు కాబడింది, కేర్‌ & షేర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేదరిక స్థాయికి దిగువన ఉన్న 10,000ల మందికి పైగా పిల్లలకు సహాయపడింది. వీధి పిల్లలు, సెక్స్‌ వర్కర్ల పిల్లలు, శారీరక వైకల్యం కలిగిన పిల్లలు, అనాథలు, అనాథ పిల్లలు మరియు అబ్జర్వేషన్‌ హోమ్‌ (స్థానిక సంస్కరణ) లో నిర్బంధించబడిన బాలలకు ఈ స్వచ్చంద సంస్థ సహాయం చేస్తుంది. విజయవాడ రెస్టారెంట్‌ను అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌, సౌత్‌ ఆపరేషన్స్‌ ఆఫ్‌ అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌, రీజనల్‌ హెడ్‌ – రితం ముఖర్జీ సమక్షంలో డాడీస్‌ హోమ్‌కు చెందిన పిల్లలు 21 సెప్టెంబర్‌ 2021న మధ్యాహ్నం 12 గంటలకు రిబ్బన్‌ కటింగ్‌ చేయడం ద్వారా ప్రారంభించారు. 2013 లో ప్రారంభమైన ఎబి, ఇప్పటికే బార్బెక్యూలో ఒక ప్రసిద్ధ బ్రాండ్‌గా కొనసాగుతున్నది, భారతదేశంలోని 19 నగరాలలో తన ఉనికిని కలిగివున్నది. దుబాయ్‌లో రెండు రెస్టారెంట్లను కూడా కంపెనీ నిర్వహిస్తున్నది.

“మా కస్టమర్‌లకు చేరువ కావడానికి మా ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతుంటుంది. మేము ఆ ప్రాంతం నుండి ఎక్కువగా కమర్షియల్‌ ఎంక్వైరీలు అందుకుంటున్నందున చాలా కాలం నుండి విజయవాడ మా దృష్టిలో ఉంది. చివరకు కృష్ణానది తీరానికి చేరుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఆదర్శవంతమైన ఆహారం మరియు సేవలతో మేము త్వరలో నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బార్‌బెక్యూ రెస్టారెంట్‌ కాగలమని మాకు నమ్మకం ఉంది,’’ అని బుధవారం ప్రారంభోత్సవం సందర్బంగా అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌, సౌత్‌ ఆపరేషన్స్‌, రీజనల్‌ హెడ్‌ – రితం ముఖర్జీ అన్నారు.

అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ తన కస్టమర్లకు డూ-ఇట్‌-యువర్‌సెల్ఫ్‌ (డిఐవై) అనుభవాన్ని అందించే ప్రత్యేకమైన ‘విష్‌ గ్రిల్‌’ కాన్సెప్ట్‌కు ప్రసిద్ది చెందింది. ‘విష్‌ గ్రిల్‌’యొక్క ప్రత్యేకమైన భావన అయిన సరదా మరియు ఉల్లాసాలతో నిండిన సరికొత్త తరహా బార్బెక్యూయింగ్‌తో ఎబి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది తద్వారా డు-ఇట్‌-యువర్‌సెల్ఫ్‌ వంటకాల భావనను ప్రోత్సహిస్తున్నది. ఎబి బార్బెక్యూయింగ్‌ యొక్క సాహసకృత్యాలను మరియు ఉత్సాహాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది, ఇక్కడ మీరు మీ ఎంపికలు, రుచులను మునుపెన్నడూ లేని విధంగా జరుపుకుంటారు. అన్ని వేడుకల సందర్భాలలో మీకు మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు మీకు ప్రియమైనవారికి ప్రత్యేకంగా అంకితమైనటువంటి ప్రదేశం అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబి). విష్‌ గ్రిల్‌లో బ్రెజిలియన్‌ చురాస్కోతో క్లబ్‌బెడ్‌లో అనేక రకాల విదేశీ మీట్‌లతో మరియు కోల్డ్‌ స్టోన్‌ క్రీమీరీ తరువాత అనంతమైన స్టార్టర్స్‌, ఫుడ్‌ మరియు డ్రింక్‌లతో ఆనందాన్ని మరియు వేడుకలను కోరుకునే ప్రతిఒక్కరికీ ఎబి ఒక గమ్యస్థానం.

విజయవాడలోని అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌లో 130 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం ఉన్నది, వీటిని ఏ సందర్భానికి చెందిన వేడుకలకైనా బుక్‌ చేసుకోవచ్చు. అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ పుట్టినరోజు మరియు వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని ఒక వినూత్న రీతిలో అందిస్తుంది.

మా అన్ని రెస్టారెంట్లలన్నింటిలో కూడా ప్రామాణికమైన అన్ని ఆరోగ్య మరియు పరిశుభ్రత పద్దతులను పాటిస్తాము మరియు రెస్టారెంట్‌ ఉద్యోగులందరూ పూర్తి టీకాలు వేయించుకున్నారు మరియు కస్టమర్‌తో వ్యవహరించేటప్పుడు అన్ని భద్రతా చర్యలను అనుసరిస్తారు.

ఇప్పుడు మీరు బార్బెక్యూ రుచికరమైన పదార్ధాలను కేవలం రూ.681/- ప్రారంభ ధరలతోనే ఆస్వాదించవచ్చు. ఎబి విజయవాడ యొక్క బఫర్‌ ధరల జాబితాను కింద ఇవ్వడం జరిగింది. ఎబి విజయవాడను ఫోన్‌ 72072 72033 లేదా www.absolutebarbecues.com ద్వారా సంప్రదించవచ్చు.

అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ గురించి :
అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌, బార్బిక్యూస్‌ బఫే రెస్టారెంట్‌ గొలుసు ప్రధాన కార్యాలయం భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉంది. రెస్టారెంట్‌ల యజమాని ప్రొసేన్‌జిత్‌ రాయ్‌ చౌదరి 2013 లో ప్రారంభించారు. ఈ బ్రాండ్‌ భారతదేశంలో 46 అవుట్‌లెట్‌లను కలిగివుంది మరియు 19 నగరాలలో తన ఉనికిని కలిగి ఉంది. రెస్టారెంట్‌ గొలుసు దుబాయ్‌లో రెండు అవుట్‌లెట్లతో అంతర్జాతీయ ఉనికిని కలిగివుంది. ఎబి ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఎబి ఆన్‌లైన్‌ విభాగాన్ని గత సంవత్సరం ప్రారంభించింది. హోమ్‌ డెలివరీ మరియు టేక్‌అవే కోసం వినియోగదారులు నేరుగా తమ ఆర్డర్‌ను https://orderonline.absolutebarbecues.com/ ద్వారా ఉంచవచ్చు. వివిధ ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ బ్రాండ్‌ అందుబాటులో ఉన్నది.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *