-ఘనంగా సన్మానించిన డ్వాక్రా మహిళలు..
-ఆమె విజయం మాకు గర్వకారణం గా ఉంది.. డ్వాక్రా మహిళలు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంక్షేమ పాలనలో మహిళలకు అగ్రతాంబులం ఇవ్వడమే కాకుండా, రాజకీయంగా కూడా ప్రోత్సహాన్ని అందిస్తున్నారని నూతనంగా ఎంపికైన కొవ్వూరు మండల జెడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల మహిళా సమాక్య కార్యాలయంలో ఎస్ హెచ్ జి సభ్యులు బొంతా వెంకటలక్ష్మీ ని సన్మానించారు. ఈ సందర్భంగా, కొవ్వూరు మండల జెడ్పిటిసి గా ఎన్నుకున్నందుకు ప్రజలకు వెంకట లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు చేరువ చెయ్యడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. మండల అభివృద్ధి తో , అర్హులైన డ్వాక్రా మహిళలకు అండగా, భరోసాగా ఉంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనితలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ, ప్రజలకు సేవ చేయడానికి , మండలం అభివృద్ధి కోసం తప్పనిసరి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
బొంత వెంకటలక్ష్మికొవ్వూరు మండలం వై ఎస్ ఆర్ క్రాంతి పథం లో స్వయం సహాయక సంఘ సభ్యులు రాలిగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు. . గత మూడు సంవత్సరాలుగా దొమ్మేరు సావరం గ్రామంలో సి.ఏ. స్వయం సహాయక సంఘం మహిళలకు చేదోడు నిలిచారు. కొవ్వూరు జెడ్పీటిసి గా బొంతా వెంకటలక్ష్మీ విజయం డ్వాక్రా మహిళల విజయమని అన్నారు.
ప్రజల పక్షాన పనిచేస్తూ నిబద్ధతను చాటుకోవాలని వ్యక్తలు పేర్కొన్నారు.. అర్హులైన వారికి పథకాలు అందేలా, పారదర్శకంగా .వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమాఖ్య కు చెందిన రమాదేవి, స్థానిక నాయకులు గారపాటి వెంకట కృష్ణ, పరిమి రామరాజు, మూళ్లపూడి కాశీ, నూతంగి ఉదయ్, ఉప్పులూరి సూరిబాబు, సుంకర సత్యనారాయణ,ఏపీఎం మహాలక్ష్మీ, స్వయం సహాయక సంఘం సభ్యురాళ్లు తదితరులు ఘనంగా సన్మానించారు.