-కొవ్వూరు మండలం లో 56 స్కూల్స్ ఎన్నికలను నిర్వహించాము.
-ఎమ్ ఈ ఓ.. జె.కెంపురత్నం
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలం పరిధిలోని 56 పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు పూర్తి చెయ్యడం జరిగిందని మండల విద్యా శాఖాధికారి జె. కెంపురత్నం పేర్కొన్నారు. స్థానిక క్రిస్టియన్ పేట స్కూల్ లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెంపురత్నం మాట్లాడుతూ, పాఠశాలల అభివృద్ధి కోసం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లో పేరెంట్స్ కమిటీలు కీలకమైన పాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకుని వొచ్చారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయయన్నారు. వాటిని అదేస్థాయి లో నిర్వహించడంలో పేరెంట్స్ కమిటీ సభ్యుల సహకారాన్ని, మెరుగైన సూచనలు ఇవ్వాలని కోరారు. మండల స్థాయిలో జరిగిన పలు స్కూల్స్ లను సందర్శించడం జరిగింది. కాపవరం స్కూల్ పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ గా కె.వెంకటలక్ష్మి, వైస్ ఛైర్మన్ గా వై.దేవి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకర పద్మినీ, హెడ్ మాస్టర్ పి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.