నూజివీడు ఎంపిపి అధ్యక్షురాలిగా ఆరేపల్లి శిరీష…

-ఉపాధ్యక్షురాలిగా అక్కినేని శ్రీవాణి
-కో ఆప్షన్ సభ్యులుగా షేక్ నాగుల్ మీరా

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా సుంకొల్లు ఎంపిటిసి ఆరేపల్లి శిరీష ఎన్నికయ్యారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం కొత్తగా ఎంపికైన ఎంపిటిసిలచే రిటర్నింగ్ అధికారి లక్ష్మణరావు, ఎంపిడిఓ జి. రాణి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సుంకొల్లు ఎంపిటిసి ఆరేపల్లి శిరీషను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిని ఎంపిటిసి లు ఎన్నుకున్నారు. పోతిరెడ్డిపల్లి ఎంపీటీసీ అక్కినేని శ్రీవాణి, కో ఆప్షన్ సభ్యులుగా షేక్ నాగుల్ మీరా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా సుంకొల్లు ఎంపిటిసి ఆరేపల్లి శిరీష ను తూర్పు దిగవల్లి ఎంపిటిసి చొప్పల్లి శ్యాం ప్రతిపాదించగా, పడమర దిగవల్లి ఎంపిటిసి పామర్తి రాము బలపరిచారు. పోతిరెడ్డిపల్లి ఎంపీటీసీ అక్కినేని శ్రీవాణిని పల్లెర్లమూడి ఎంపీటీసీ టి.. అమీర్ బాషా బాబు ప్రతిపాదించగా బోర్వంచ ఎంపీటీసీ తాడేపల్లి సునీత బలపరిచారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఎంపీటీసీ లు, మండల అధ్యక్ష, ఉపాద్యక్షులు, కో ఆప్షన్ సభ్యులను శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

-రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు -ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద విత్తనం నాటిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *