-ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దిశ యాప్ ఉంటే అన్న మన తోడు ఉన్నట్లే అనే భవనను కల్గిగే విధంగా ప్రతి మహిళా అవగాహన కల్గియుండాలని, మహిళల రక్షణ కోసం, ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరoగా ఉంటుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. యం.జె నాయుడు హాస్పటల్ 35వ వార్షికోత్సవాల సందర్బంగా గురువారం జ్యోతి కన్వెన్షన్ హాలు నందు ఎరాప్టు చేసిన కార్యక్రమములో మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొనారు. అక్టోబర్ 2,3 తేదిలలో జరుగనున్న కళాశాలల విద్యర్దినులకు మహిళా భద్రతా వకృత్వ o దిశ యాప్ పై స్కిట్స్ పోటీలను మేయర్ ప్రారంభిస్తూ, ఏట యం.జె.నాయుడు హాస్పటల్ తమ వార్షికోత్సవాలలో భాగంగా ఒక సామాజిక సమస్య పై అవగహనకు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనియమని అన్నారు. దిశ యాప్ పై అవగాహాన కొరకు యం.జె.నాయుడు హాస్పటల్ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రశంసించారు. ఈ పోటిలలో నగరానికి చెందిన 30 కళాశాలలనుండి వచ్చిన విద్యార్ధినులు వకృత్వo, స్కిట్స్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలు చాటుకున్నారు. ఈ కార్యక్రమoలో డా.యం.జె.నాయుడు, ఆయినా సతిమతి మాధవి హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు. సభకు హాస్పటల్ గౌరవ అధ్యక్షులు వావిలాల రజనీకాంత్ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా పాఠశాలల విద్యార్ధిని విద్యార్దులకు అదే విషయమై చిత్ర లేఖనంలో పోటీలు జరిగాయి. విజేతలకు వార్షికోత్సవ వేదికపై ఆకర్షిణీయమైన బహుమతులు ప్రదానం జరుగుతుoదని వివరించారు.