విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ జన్మదిన వేడుకలు విజయవాడ లో ఘనంగా నిర్వహించారు. నల్లబిల్లి కనక ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్ వద్ద పోతిన వెంకట మహేష్ తో కేక్ కటింగ్ చేయించారు. అనంతరం పేదలకి వంద మందికి వస్త్ర దానం మరియు 500 మందికి అన్నదానం చేసారు. 45 వ డివిజన్ స్థానిక నాయకులు బావిశెట్టి శ్రీనివాస్, సలుగు నాని ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు సందర్బంగా కేక్ కటింగ్ మరియు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్, విజయవాడ నగర కార్యదర్శి శనివరపు శివ స్థానిక నాయకులు బొమ్ము రాంబాబు దంపతులు పాల్గొన్నారు. 50వ డివిజన్ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పోతిన మహేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిళ్ళశ్రీను పాల్గొని కేక్ కట్ మరియు 300 మందికి పళ్ళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నూనె సోమశేఖర్, మద్దెల కనకారావు, సాబిన్ కార్ నరేష్, సయ్యద్ ముబిన, పిల్ల రవి.రెడ్డిపల్లి గంగాధర్, రామిశెట్టి మురళి, చొక్కెరనగేష్, వినోద్. రాంబాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 41 డివిజన్ యువనాయకులు రాజా నాయకుడు, నగర సంయుక్త కార్యదర్శి తిరునగరి మురళి కృష్ణ, 41 డివిజన్ నాయకులు కురాకుల సురేష్, స్థానిక భవనిపురం లో కేక్ కటింగ్ చేసి 200 మందికి మహిళలకు చీరలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన నగర ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్ స్థానిక 40 డివిజన్ నాయకులు ఎస్ కె ఐజ, మరియు స్థానిక కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. 37 డివిజన్ సామరంగచౌక్ వద్ద శిరంశెట్టి రాము, తవ్వ మారుతి, అడ్డగిరి పుల్లారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు శివ శంకర్ , బొలిశెట్టి వంశీ కృష్ణ పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం పేదలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి మోవిన, ఏన్నమనేని కృష్ణ, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 39 డివిజన్ నాలుగు స్తంభాలు సెంటర్ వద్ద జనసేన పార్టీ కృష్ణాజిల్లా లీగల్ సెల్ కార్యదర్శి గంజి పవన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు 200 మందికి అన్నదానం చేశారు. వాగు సెంటర్ వద్ద చుక్కల నగేష్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వీర్యంలో లో మహేష్ పుట్టినరోజు సందర్భంగా 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 53 డివిజన్ డివిజన్ నందు కొత్తపేట చేపల మార్కెట్ వద్ద రేకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహేష్ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కటింగ్, పేదలకు అల్పాహారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ బొలిశెట్టి వంశీ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో జనసేన పార్టీ నగర కార్యదర్శి బట్ట సాయి కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు 200 మందికి స్వీట్స్ పంపిణీ చేశారు.
Prajavartha Online Telugu News