Breaking News

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులను సిద్ధం చేయండి… : వైద్యాధికారులకు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధం చేయాలని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో చైల్డ్ ఫండ్ మరియు హోప్ స్వచ్చంద సంస్థలు అందించిన 20 లక్షల రూపాయలు విలువచేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పల్స్ ఆక్సీ మీటర్లు, తదితర మెడికల్ సామాగ్రిని శాసనసభ్యులు చేతుల మీదుగా ఆసుపత్రి వైద్యాధికారులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలన్నారు. థర్డ్ వేవ్ లో ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపవచ్చన్న హెచ్చరికల దృష్ట్యా నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీడియాట్రిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీడియాట్రిక్స్ విభాగంలో పీడియాట్రిషన్ పోస్ట్ కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చిన్న పిల్లలకు సంబందించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు లతో పాటు అవసరమైన అన్ని వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూజివీడు పరిసర ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కరోనా నియంత్రణలో సామజిక బాధ్యతగా 20 లక్షల రూపాయలు విలువచేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, పల్స్ ఆక్సీ మీటర్లు, తదితర మెడికల్ పరికరాలను అందించినందుకు చైల్డ్ ఫండ్, హోప్ స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అభినందించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేంద్ర సింగ్, స్నేహ రైట్స్ అధినేత మరియు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బసవరాజు నగేష్, కౌన్సిలర్ శీలం రాము, చైల్డ్ ఫండ్ మరియు హోప్ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పి .రాజు , ప్రసాద్ , ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *