మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని (అనంతపురం,కర్నూలు మరియు వైయస్ఆర్ కడప జిల్లాలు మినహా) పశుపోషకులందరికీ సంచాలకులు, పశుసంవర్తకశాఖ వారి విజ్ఞప్తి, పశుసంవర్ధకశాఖ వారు 01-10-2021 నుండి 31-10-2021వ తేది వరకు పశువులకు గాలికుంటు వ్యాంధి నివారణ టీకాలు ఉచితముగా ప్రతి గ్రామములో రైతు ఇంటి వద్దనే వేయట జరుగుతుంది. గాలికుంటు వ్యాధి వలన పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్ధ్యం గణనీయంగా తగ్గిపోవడంతో రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. కావున పశుపోషకులు అందరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా తమ పశువులన్నింటికి టీకాలు వేయించుకొని గాలికుంటు వ్యాధి నుండి కాపాడుకోవలసినదిగా కోరడమైనది. మరింత సమాచారము కొరకు మీదగ్గరలోని పశువైద్యుని సంప్రదించగలరని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రచార మరియు విస్తరణ విభాగం ఉప సంచాలకులు డాక్టర్ పి. పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tags machilipatnam
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …