మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ మాసంలో వచ్చే దసరా మరియు మిలాద్ ఉన్ నబి పండుగల సందర్భంగా కోవిడ్ నేపధ్యంలో ఎలాంటి ఊరేగింలపుకు అవకాశం లేదని బందరు ఆర్డీవో ఎస్ఎస్ కె. ఖాజావలి స్పష్టం చేశారు. గురువారం ఆర్ డివో కార్యాలయంలో దసరా కమిటి, ముస్లిం పెద్దలతో సంబంధిత అధికారులతో ఆర్ డివో సమావేశం నిర్వహించి అక్టోబరు నెలలో ముఖ్యపండుగలు దసరా, మిలాద్ ఉన్ నబి సందర్భంగా విడ్ నేపధ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ మిలాద్ ఉన్న సందర్భంగా కోవిడ్ కట్టడిలో భాగంగా తక్కువ మందితో మసీదుల్లో భోజనాలు ఏర్పాటు చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తక్కువ మందితో సామాజిక దూరం పాటిస్తు మసీదులో స్థలం ఆధారంగా 50 నుండి 150 మంది వరకు ప్రార్ధనలు జరుపుకోడానికి సమావేశంలో నిర్ణయించినట్లు, కోవిడ్-19 దృష్ట్యా ఊరేగింపులకు అవకాశం లేదన్నారు. అక్టోబర్ 6 నుండి 15 వరకు జరిగే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శక్తి పటాల ఊరేగింపునకు అవకాశం లేదని, గుడిలోపల మాత్రమే శక్తి పటాలు పెట్టుకుని పూజలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తు పండుగలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బందరు డిఎస్ పి మాసుంబాషా మాట్లాడుతూ దసరా, మిలాద్ ఉన్నబి పండుగల సందర్భంగా బహిరంగ ప్రదర్శనలు, ఊరేగింపులకు అవకాశం లేదని ఈ సమావేశంలో చెప్పడం జరిగిందని, వారందరు అంగీకరించారని, కావున అందరు సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
Tags machilipatnam
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …