-ఏఓ స్వామినాయుడు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుదం పట్టకుండా అహింసా మార్గంలో పోరాడి భానిష సంకెళ్ల నుండి భారతావనికి ముక్తిని ప్రసాదించిన మహనీయుడు పూజ్యబాపూజి మహాత్మాగాంధి అని ఆర్డీవో కార్యాలయపు పరిపాలనాధికారి స్వామినాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధి 152 వ జయంతి ని పురష్కరించుకొని ఏవో స్వామినాయుడు కార్యాలయ సిబ్బందితో కలసి మహాత్మాగాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్డాడుతూ మహాత్మాగాంధి వంటి ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సమకూరిందని అన్నారు. నేడు మనం స్వతంత్రులుగా జీవించగలుగుతున్నామంటే అటువంటి చిరస్మణీయులను గుర్తుంచుకోవలసిన భాద్యత మనపై ఉందని అన్నారు. ఆ మహాత్ముని జయంతి రోజున నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో కాలుష్య నివారణే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన పారిశుద్ద్య సేవలను అందించేందుకు జగనన్న స్వచ్చ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో కార్యాలయపు ఎఓ బాలాజి, సిబ్బంది రజనీకాంత్, తదితరులు ఉన్నారు.