నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
అహింసే ఆయుధంగా దేశానికీ స్వాతంత్రం సాధించిన గాంధీజీ జీవితం ప్రతీఒక్కరికీ ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతి, అహింస అనే రెండు ఆయుధాలతో గడగడలాడించిన మహాత్మా గాంధీజీ జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గాంధీజీ జీవితం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు , నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. సత్యం, అహింస రెంటిని కలిపి సత్యాగ్రహమనే ఆయుధాన్ని తయారుచేసి దేశానికీ స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చారన్నారు. స్వాతంత్రోద్యమంలో తెల్ల వారికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను అహింసా మార్గంలోనే నడిపారని, భారత జాతి మొత్తం గాంధీజీ వెనకే నడిచ్చిందన్నారు. ప్రతీ వ్యక్తి తనను తానూ ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించాలన్నారు. గాంధీజీ పరిశుభ్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆరోజుల్లోనే సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమానికి బీజం వేశారన్నారు. లోకానికే ఆదర్శంగా నిలిచిన మన జాతిపిత జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం ‘ గా నిర్వహించుకుంటున్నామన్నారు. గాంధీజీ చూపిన బాటలో నడిచి ఆయన ఆశయసాధనకు కృషి చేయడమే గాంధీజీకి మనమిచ్చే నిజమైన నివ్వాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి చెప్పారు. కార్యక్రమంలో డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …