Breaking News

విద్యుత్ కొనుగోళ్లలో పొదుపు ప్రయోజనాలు వినియోగదారులకే…

-ఏపీఈఆర్సిని అనుమతి కోరిన విద్యుత్ సంస్థలు
-విద్యుత్ రంగంలో మొదటి త్రైమాసికంలో రూ 126.15 కోట్లు ఆదా చేసిన విద్యుత్ డిస్కాములు.
-విద్యుత్ సంస్థలకు గత రెండేళ్లలో అమలు చేసిన అత్యుత్తమ విధానాలతో సత్ఫలితాలు
-వినియోగదారులకు అత్యుత్తమ సేవలు.. 24X 7 నాణ్యమైన విద్యుత్ సరఫరా.. విద్యుత్ సంస్థల లక్ష్యం
-జాతి పిత మహాత్మా గాంధీ కి ఘన నివాళులు అర్పించిన ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విద్యుత్ రంగంలో గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుతమ విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ వృథాను అరికట్టి, ప్రజాధనాన్ని అదా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు చేపట్టిన చర్యలు వినియోగదారులకు , విద్యుత్ రంగానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ విధంగా ఆదా అయిన మొత్తాన్ని తిరిగి వినియోగదారులకు అందజేయాలని ప్రభుత్వము, విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి అనుమతిని కోరాయి.
ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపిన వివరాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో డిస్కాములు రూ.126.15 కోట్లు అదా చేశాయి. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గత రెండేళ్లగా విద్యుత్ సంస్థలు అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు , విద్యుత్ పంపిణి నష్టాలు కొంత మేర తగ్గించడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ విధంగా ఏపీఎస్పీడీసిఎల్ 6,013 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ను ఏపీఈఆర్సి నిర్ణయించిన ధర కంటే రూ . 15 పైసలు తక్కువ ధరకు కొనుగోలు చేయటం జరిగింది. తద్వారా రూ 89.23 కోట్లు ఆదా చేసింది. అలాగే ఏపీసిపీడీసిఎల్ 3670.14 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసి, రూ 33.25 కోట్లు అదా చేయటం జరిగింది. అలాగే ఏపీఈపీడీసిఎల్ రూ 3.67 కోట్లు ఆదా చేసింది. ఈ నేపథ్యంలో ఇలా ఆదా అయిన 126.15 కోట్లను తిరిగి వినియోగదారులకే ఇవ్వాలనేది విద్యుత్ సంస్థల ఆలోచన గా ఉంది. ఇందుకు అనుమతి కోరుతూ విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సి కి విన్నవించాయి.
జాతి పిత మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా శనివారం నాడు విద్యుత్ సౌధలో జరిగిన కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగదారుల ప్రయోజనం, విద్యుత్ రంగం బలోపేతానికి ఉపయోగించుకోవాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయన్నారు. విద్యుత్ రంగంలో అమలవుతున్న ప్రతి విధానం, కార్యక్రమం లక్ష్యం వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే అని స్పష్టం చేసారు .
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఇంధన కార్యదర్శి పూల మల వేసి నివాళులు అర్పించారు. వినియోగదారులు సంస్థల పై ఆధారపడరని, సంస్థలే వినియోగదారులపై ఆధార పడతాయని , వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు తోలి ప్రాధాన్యత ఇవ్వాలని మహాత్మా గాంధీ గారి సూక్తిని ఆయన గుర్తుచేశారు. విద్యుత్ రంగంలోజాతి పిత స్ఫూర్తి తో వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించటం, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు .
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్/ఏ పీ ట్రాన్స్కో , కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ గ్రిడ్ & ట్రాన్స్మిషన్, కె. ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఫైనాన్స్, కె. ముత్తుపాండియన్, , సి జీ ఎం హెచ్ ఆర్ డీ , లక్ష్మి వర మీరా కుమార్ , చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డిప్యూటీ సెక్రటరీ జాన్ , ఎఫ్ఏసిసిఏ , మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *