విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధులలో స్వాతంత్ర్య స్పూర్తిని మరియు నగరంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంగా పలు అంశాలలో పోటీలను నిర్వహించినట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా నగర పరిధిలోని మున్సిపల్ మరియు ప్రవేట్ విద్యా సంస్థల హైస్కూల్ బాలబాలికల నడుమ 4 అంశాలలో పోటీలు జరిగాయి. 1. డ్రాయింగ్ / పెయింటింగ్. 2. స్క్రాప్ ఆర్ట్ , 3. క్లే ఆర్ట్ మరియు 4. రంగోలి పోటీలు నిర్వహించుట జరిగింది. కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విద్యార్ధులు వేసిన చిత్రాలను పరిశీలించిన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” స్వచ్చ్ విజయవాడ, స్వచ్చ్ అండ్ గ్రీన్ విజయవాడ మరియు హెల్త్ విజయవాడ అంశాలను తమ చిత్రాల ద్వారా చూపించిన విద్యార్ధులకు అభినందనలు తెలియజేసారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమములో పోటిలలో పాల్గొనిన వారికీ సర్టిఫికేట్ అందించుటతో పాటుగా 4 క్యాటగిరి లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికీ మొదటి బహుమతిగా రూ.3000/- రెండువ బహుమతిగా రూ.2000/- మరియు మూడోవ బహుమతిగా రూ.1000/- నగదు బహుమతులను అందజేసారు. కార్యక్రమము నిర్వహణకు అధనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదా దేవి తోడ్పాటుగా జోనల్ కమిషనర్ మరియు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఇన్ ఛార్జ్ అధికారి కె.వి.వి.ఆర్ రాజు పర్యవేక్షణలో స్కూల్ సూపర్ వైజర్లు పాల్గొన్నగా పోటిలలో సుమారు 250 మంది పైబడి విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …