-యంపీడీవో వెంకటరమణ
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ రూరల్ మండలంలోని జగనన్న కాలనీ లేవుట్ల ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గద్దే పుష్పరాణి అధ్యతన గృహనిర్మాణ పురోగతి పై హౌసింగ్, ఇవో పీఆర్ ఆర్డీ, డీటీ,వీఆర్వోలు, గ్రామ సెక్రటరీలు, ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లుతో యపీడీవో వెంకట రమణ సమీక్షించారు. ఈ సందర్బంగా యంపీడీవో మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వేగవంతం చెయ్యాలన్నారు. పేదలకు పక్కా గృహాలు అందించే జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ వారికి నిర్థేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో చర్చించి, వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించడమే కాక, సిమెంట్, స్టీల్ వంటి మెటీరియల్స్ సబ్సిడీ ధరపై లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తున్నదని, ఈ అంశాలను లబ్దిదారులకు తెలియజేసి ఇళ్ళు నిర్మించుకునేలా చైతన్య పరచాలన్నారు. అనంతరం పాఠశాలల ఆధునీకీకరణపై నాడు – నేడు రెండవ దశ పనుల పై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. నాడు- నేడు ద్వారా తొలి దశ విజయవంతంగా పూర్తయ్యిందని రెండవ దశలో చేపట్టిన ఫాఠశాలలను ఆధునీకరణపై సచివాలయ ఉద్యోగులు, పాఠశాల కమిటీల సభ్యులు, ఉపాద్యాయులు సమన్వయంతో రెండవ దశ నిర్మాణపు పనులను వేగవంతం చెయ్యాలన్నారు. సమావేశంలో యంపీపీ గద్దే రాణి, డీఇ హరిబాబు, హౌసింగ్ ఏఈ సుబ్బారావు,, పంచాయితీరాజ్ ఏఇ సూరిబాబు, యంఇవో డి రామారావు, ఇవో పీఆర్ అర్డీ, డిప్యూటీ తహాశీల్థారు, వీఆర్వోలు, గ్రేడ్ 5 సెక్రటరీలు, సచివాలయ ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.