-జిజీ హెచ్ ఓవి విభాగాని వరిశీలించిన సబ్ కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ను సోమవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈ పరీక్షల నిర్వహణకు 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,674 మంది పరీక్షలు వ్రాయనున్నట్లు ఆయన వివరించారు. అనంతరం నగరంలోని జిజిహెచ్ ఆసుపత్రిని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సందర్శించారు. ఓవీ విభాగాని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పేషంట్లతో వారికి అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. తదుపరి ఆసుపత్రిలోని ఓపి విభాగాని మరింత నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై వైద్య అధికారులతో ఆయన సమీక్షించారు.