-జిల్లాలో స్వప్ కార్యక్రమం ద్వారా ఓటర్ల చైతన్యవంతులను చేసేందుకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం ..
-కలెక్టరు జి. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటర్ల జాబితాలు సంక్షిప్త సవరణ, పోలింగ్ కేంద్రాలు చేర్పులు చేపట్టి 2022 జనవరి 5 నాటికి తుది జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరు బి. నివాస్ అన్నారు.
నగరం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఓటర్ల జాబితాలు సవరణ, చేర్పులు మార్పులు వంటి అంశాలపై జిల్లా కలెక్టరు బి. నివాస్ జిల్లాలోని వివివధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఓటర్ల సవరణ జరిగే నాటికి 36,27,998 మంది ఓటర్లు ఉంటారని అందనావేశామన్నారు. ఇందులో భాగంగా 18 నండి 19 ఏళ్లు వసయస్సు గల యువత 1,04,779 మంది ఉంటారనే అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం జాబితాల్లో 21,497 మందిని నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని 1500 మించిన పట్టణ పోలింగ్ కేంద్రాల్లో 1200 పోలింగ్ కేంద్రాలు రేషలైజేషన్ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,051 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో పట్టణ ప్రాంతాల్లో 1244, గ్రామీణ ప్రాంతాల్లో 2,807 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాల్లో 32 పోలింగ్ కేంద్రాల్లో లోకేషన్లు మార్పు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అలేగా 32 నియోజకవర్గాల్లోని 13 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల పేరు మార్పులకు ప్రతిపాధనలు వచ్చాయన్నారు. అదేవిధంగా కొత్తగా మరో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కోసం మచిలీపట్నం నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమం కింద ఓటర్ల చైతన్యవంతులను చేసేందుకు పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. గరుడా యాప్ ఎన్నికల కమీషన్ ప్రారంభించిన అనంతరం ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియను యాప్ ద్వారా చేయడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలు సవరణలో భాగంగా జిల్లాలో ఆగస్టు 9 నుంచి అక్టోబరు 31 వరకు బూత్ లెవెల్ స్థాయిలో తప్పులు, డబుల్ ఎంట్రీలు వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. నవంబరు 1 నాటికి సవరణ చేసిన జాబితాలను ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉంచి నవంబరు 30 వరకు ఓటర్లు నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. తదుపరి 2012 జనవరి 5 నాటికి సవరణ చేసిన ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని కలెక్టరు జె.నివాస్ అన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతిపాధనల వివరాలు :బందరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ప్రతినిధులు బోడే ప్రసాద్, సిహెచ్.ఉషారాణి కలెక్టరు వివరిస్తూ మరణించిన ఓటర్లును, డబుల్ ఎంట్రీలను తొలగించాలని అందుకు నగర, పట్టణ, గ్రామ పంచాయితీల్లో మరణ ధృవీకరణ పత్రాలను తీసుకొని జాబితాల్లో సరవరణ చేయాలని సూచించారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరుపున వచ్చిన ప్రతినిధి రాంతియా కుమారి వివరిస్తూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఓటు నమోదు చేసుకోవడం వలన వారికి రెండు ప్రాంతాల్లో ఓటు ఉంటుందని దీనిని వారు ఓటు నమోదు నమోదుకు వీలు కావడం లేదని మైగ్రేషన్ డెలీట్ చేసి సవరించారన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఓటర్ల స్లిప్పులు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నందున కొంత మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నా రని సూచించారు. ఈ సందర్భంగా వై ఎస్సార్ సీపీ పార్టీ ప్రతినిధి నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, బీజేపీ పార్టీ ప్రతినిధులు టి. శివనాగేశ్వరరావు, బోగవల్లి శ్రీధర్, బిఎస్సీపి పార్టీ ప్రతినిధి చిట్టిబాబు ఓటర్ల జాబితాలు సవరణ పై పలు అంశాలను కలెక్టరు దృష్టికి తెచ్చారు.
సమావేశంలో జాయింట్ కలెక్టరు (ఆసరా) కె. మోహన్ కుమార్, టీడీపీ పార్టీ ప్రతినిధులు బోడే ప్రసాద్, సిహెచ్. ఉషారాణి, నేషనల్ కాంగ్రేస్ ప్రతినిధిగా తాంతియా కుమారి, వై ఎస్సార్ సీపీ పార్టీ ప్రతినిధిగా శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, బీజేపీ పార్టీ ప్రతినిధులు టి. శివనాగేశ్వరరావు, టోగవల్లి శ్రీధర్, బిఎస్సీపీ పార్టీ ప్రతినిధి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.