విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయాలు, మండపాలలో అమ్మవారికి భక్తులు పంచామృతాభిషేకం నిర్వహించి.. వివిధ రకాల పుష్పాలు, కుంకుమలతో ఆరాధించారు. అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, లూనా సెంటర్, గవర్నర్ పేట, దుర్గ అగ్రహారం, బర్మాకాలనీ, ప్రజాశక్తి నగర్ సహా పలు ప్రాంతాలలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. స్వార్థం లేకుండా ఎటువంటి ఫలితం ఆశించకుండా చేసే ఏ దానమైనా పుణ్యకార్యంతో సమానమని పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం చేయడం ఎంతో ఉత్తమమైనదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని.. ప్రతిఒక్కరూ తమ వంతుగా ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదల ఆకలి తీర్చే ఇటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని.. దాతలు చేస్తున్న సేవలను అభినందించారు. వారికి ఎల్లవేళలా తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు అన్నవితరణ చేశారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …