విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
450ఏళ్ళ చరిత్ర కలిగిన రెండుతెలుగు రాష్ట్రలో ప్రఖ్యాతి గాంచిన హజరత్ అలీ హుస్సేన్ షా ఖాదరీ, హజరత్ సయ్యద్ షా ఖాదరీ దర్గాలో మంగళవారం ఉదయంనుండి సాయంత్రం వరకు విశ్వ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఈద్ -మిలాదున్ నబి పండుగ ఘనంగా జరిగింది. హజరత్ అలీ హుస్సేన్ షా ఖాదరీ ,హజరత్ సయ్యద్ షా ఖాదరీ భక్తబృందం లంగర్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్ ప్రధానకార్యదర్శి షేక్ నాగూర్ ఆధ్వర్యంలో జష్నే -ఈద్ మిలాద్-ఉన్-నబి వేడుకలు నిర్వహించటం జరిగింది. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ ఎండి . కరీమున్నిసా బేగం , విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లు పాల్గొని దర్గాలో ప్రతేక ప్రార్ధనలు జరిపిన అనంతరం బాబా వారి గుమ్మస్ లపై చాదర్ , పూలు, అత్తార్, గంధం ఎక్కించటం జరిగింది. అనంతరం ఇస్లాం సంప్రదాయం ప్రకారం లంగర్ కమిటీ వారుఎమ్మెల్సీ ఎండి . కరీమున్నిసా బేగం ,విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లతోపాటుపలువురిని సత్కరించటం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. లంగర్ కమిటీవారు అన్నప్రసాదంను సుమారు 500మందికి పంపిణి చేయటం జరిగింది .
మీడియాతో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,ఎమ్మెల్సీ ఎండి కరీమున్నిసా మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు ముస్లిం సోదరులకు సోదరి మణులకు ఈద్ -మిలాద్ -ఉన్ -నబి శుభాకాంక్షలు తెలియచేసారు. అదేవిధంగా లంగర్ కమిటీ వారి సేవాకార్యక్రమాలను కొనియాడారు. దర్గా అభివృధికి తమవంతు కృషిచేస్తామని దర్గా అభివృధి విషయాన్నిరాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి దర్గాను తప్పకుండ అభివృద్ధి చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో దర్గా ముత్తవలి సయ్యద్ ఖాజా మొహినుద్దీన్ పీరా, అన్వర్ పాషా కుమారులు అఙ్గార్, సంధాని, వైసీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి రుహుల్లా, విజయవాడ కార్పోరేషన్ కోా – అప్షన్ నంబర్ సయ్యద్ అలీమ్ ,వైసీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖాదర్ వలి (క్వాలిటీ ) సుభాని , అలీమ్, లంగర్ కమిటీ ఉపాధ్యక్షులు కరీముల్లా, షేక్ ఖాజా మొహిద్దీన్, ఎలైట్ కార్ డీలర్ అధినేత చాన్ బాషా ,కోశాధికారి అంజాద్ హుస్సేన్ బేగ్ ,టేకుమూడి అశోక్, ఖయూమ్, ఇసుబ్, ఎంఐఎం నాయకులు షేక్ సమీర్, షేక్ ఖమ్మర్, అల్తాఫ్, జనసేన నాయకులు ఐజాఅహ్మద్, అమీర్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు