మంత్రి తానేటి వనిత చేతులు మీదగా పోలీస్ ఆల్బమ్ ను రిలీజ్…

తాడేపల్లిగూడెం/కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చేతులు మీదగా పోలీస్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానే టి వనిత చేతులు మీదగా నాగరాజు కంపోస్ చేసిన పోలీస్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ తానేటి శ్రీనివాస్, కొవ్వూరు డిఎస్పీ శ్రీ నాథ్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ లు  తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్‌ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటూ, వారి సేవలను స్మరించుకోవడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *