విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారని వైస్సార్సీపీ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గుణదాల తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ 3,5 డివిజిన్లకు చెందిన చింతలచేరువు దాసు,దివ్య లకు మంజూరు అయిన దాదాపు 6లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి పొందాలి అంటే టీడీపీ వారికి,జన్మభూమి కమిటీల వారికి లంచాలు ఇచ్చి కళ్ళారిగెల కార్యాలయాల చుట్టూ తిరిగిన సరే వస్తాయనే నమ్మకం ఉండేది కాదని,నిరుపేదలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి ని నిర్విర్యం చేసి కేవలం వారి పార్టీ వారి ఆర్థిక అవసరాలు తీర్చుకొనేల ఉపయోగించుకొన్నారని విమర్శించారు. కానీ నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో పారదర్శకంగా ఎవరికి లంచాలు ఇచ్చే పని లేకుండా కులమత పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా గా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోంది అని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని పెంచి పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం చేరువ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం దే అని,ప్రక్క రాష్ట్రలలో కూడా ఈ పధకం ద్వారా వైద్య చికిత్స చేపించుకోవచ్చు అని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని, ఎవరైనా ఆర్జి పెట్టుకోవాలి అంటే మా కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కలపాల అంబేద్కర్, భీమిశెట్టి ప్రవల్లిక, వైసీపీ నాయుకులు ఒగ్గు విఠల్, సొంగ రాజకమల్, భీమిశెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …