Breaking News

చిరువ్యాపారులకు ఆసరాగా నిలుస్తున్న జగనన్న తోడు…


-కృష్ణాజిల్లాలో 32,697 మంది చిరువ్యాపారులకు వడ్డీ రాయితీ కింద రూ.1.15 కోట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు పథకం ద్వారా కృష్ణాజిల్లాలో 32,697 మంది చిరువ్యాపారులకు రూ. 1.15 కోట్లు వడ్డీ రాయితీ కింద అందుతుందని చెప్పారు.
బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జగనన్న తోడు పథకం ద్వారా 10 వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పొందిన చిరువ్యాపారులు సాంప్రదాయ వృత్తి దారుల బ్యాంకు ఖాతాల్లో వడ్డీ రాయితీ జయ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా డిఆర్‌డిఏ ద్వారా 30 వేల 116 మంది లబ్దిదారులకు రూ. 1,05,61,640లు, మెప్మా ద్వారా 1,332 మంది లబ్దిదారులకు రూ. 5,28,986లు, వియంసి ద్వారా 1249 మంది లబ్దిదారులకు రూ. 4,69,951లు, వడ్డీ రాయితీ అందించడం జరిగిందన్నారు. మొత్తం మీద 32,697 మంది చిరువ్యాపారులకు రూ. 1,15,60,575లు వడ్డీ రాయితీ ప్రయోజనం పొందరన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, మేక వెంకట ప్రతాప అప్పారావు అన్నారు.
పెనమలూరుకు చెందిన దోనే రత్నకుమారి మాట్లాడుతూ గతంలో చిన్న బల్లపై తినుబండారాలు అమ్ముకుంటు చిన్న ఆదాయం పొందేదానినని చెప్పారు. జగనన్న తోడు కింద అందిన రూ. 10 వేల వడ్డీలేని రుణంతో ఎక్కువ సరుకులు తెచ్చి అమ్ముకుంటు రూ. 100 నుంచి 150 వరకు ఆదాయం పొందుతునన్నాను. అంతే కాకుండా సచివాలయ సిబ్బంది నన్ను ఒంటరి మహిళగా గుర్తించి పెన్షన్‌ మంజూరు చేయడమే కాకుండా ప్రతీ నెల 1వ తేదిన తెల్లారిపొద్దునే రూ. 2,250 పెన్షన్‌ వాలంటీర్లు అందిస్తున్నారన్నారు. అదేవిధంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నాప్పుడు ఇల్లు ఇచ్చారని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పెన్షన్‌తో పాటు జగనన్న తోడుతో తనను పోషిస్తున్నారని రత్నకుమారి ఆనందం వ్యక్తం చేశారు.
జి. కొండూరు మండలం కవులూరుకి చెందిన ప్రిస్కిల్లా మాట్లాడుతూ తాను చిన్న కాయకూరల వ్యాపారంతో రూ. 100 నుంచి 150 వరకు ఆదాయం పొందేదానినని అయితే జగనన్న తోడుతో వడ్డీ లేని రుణం రూ.10 వేలు తీసుకుని కూరగాయలతో పాటు చిన్న కిరాణ సామానులు అమ్మడం ప్రారంభించి 400 వరకు ఆదాయం పొందుతున్ననని తెలిపారు. అంతే కాకుండా తమ పిల్లలకు అమ్మఒడి, తనకు ఆసరా, ఇల్లు మంజూరు అయిందని దీనికంతటికి కారకులైన ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యావాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.
విజయవాడ కు చెందిన సిద్ధికా మాట్లాడుతూ జగనన్న తోడుతో అందిన వడ్డీ లేని రూ.10 వేల రుణంతో ఇంటిదగ్గరే ఫ్యాన్సీ షాపు నిర్వహించుకుంటున్ననని ఆదాయం బాగుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానికి కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ శాసనసభ్యులు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, మేకా వెంకట ప్రతాప అప్పారావు, ఎమ్మెల్సీ యండి కరీమున్నిసా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విశ్వ బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, గౌడ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాదు శివరామకృష్ణ, వడ్డీలు కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి, డిఆర్‌డిఏ పిడి జె సునీత, మెప్మా పిడి యం రమదేవి, వియంసి యుసిడి అధికారి శ్రీధర్‌, పలువురు చిరువ్యాపారులు, సాంప్రదాయ వృత్తి దారులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *