Breaking News

ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారుల సమీక్ష

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు Pre-Revision Activities SIR 2026 జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి సమక్షంలో జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి అధికారులు మరియు అసిస్టెంట్ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులు, తాసిల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్లు జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రంలో అధికారులు, బూత్ లెవల్ అధికారులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ జిల్లాలో తక్కువగా ఉండటం వల్ల ఏడూ నియోజకవర్గాలలో సమీక్ష సమీక్షించారు. ఇందులో భాగముగా తక్కువ శాతం చేసిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులను మరియు అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులను మరియు బూత్ లెవెల్ అధికారులను మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్ పర్సంటేజ్ శాతమును పెంచవలసిందిగా ఆదేశించారు. అదేవిధంగా 10% కన్నా తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రములను గుర్తించి బూత్ లెవెల్ అధికారులను మందలించి తక్షణమే మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్ శాతమును పెంచవలసిందిగా ఆదేశించారు. గతంలో 10 శాతం కన్నా తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బూత్ అధికారులకు షోకాష్ నోటీస్ ఇవ్వడం జరిగినది ఇదే విధముగా ఏ బూత్ అధికారి అయిన తక్కువ పర్సంటేజ్ ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఖచ్చితముగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్మండ్ జిల్లాలో ఏడు నియోజకవర్గ సంబంధించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులను మరియు అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ అధికారులు మరియు బూత్ లెవల్ అధికారులు హాజరయ్యారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *