Breaking News

కొవ్వూరు నియోజక వర్గ స్ధాయిలో ఏపీ సీఎం కప్ క్రీడా సంబరాలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సీఎం కప్ క్రీడా సంబరాలు కొవ్వూరు నియోజక వర్గ స్ధాయిలో ది .02.11. 2021 వ తేదీన కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలస్ధాయి లో నిర్వహించడం జరుగుతుందని డి ఎల్ డి ఓ, ఎంపీడీఓ పి. జగదాంబ శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేసారు. ఏపీ సీఎం కప్ కొవ్వూరు నియోజక వర్గ క్రీడా పోటీలు 2021-2022 సంవత్సరం కిగాను నియోజక వర్గ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు క్రీడాకారులను మండల స్ధాయి నుండి ఎంపికలు జరుగును . కొవ్వూరు నియోజక వర్గములో కొవ్వూరు , చాగల్లు ,తాళ్లపూడి మండలంలో ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో పాల్గొను 15 సం., ల వయసు పై బడి ఉండవలెను . మండల పోటీలలో పాల్గొను క్రీడాకారులు మండల ఇంచార్జ్ లకు నవంబర్ 1 వ తేది లోగా వారి వివరాలు తెలియచేయవలెను. మండల స్థాయి లో కన్వీనర్-ఎం. పి .డి . ఓ నియోజక వర్గం ఇంచార్జ్ : ఎస్. నాగరాజు ఎస్ఏపిఇ – 9963753246 వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. చాగల్లు మండలానికి సిహెచ్ . సతీష్ కుమార్ – 7013912527 ; తాళ్లపూడి మండలానికి కె. వెంకటేశ్వరరావు -8143220976 ; కొవ్వూరు మండలానికి -జె.పండు -9542520204 లను నియమించామన్నారు. కొవ్వూరు మండలంలో కుమారదేవం గ్రామము నందు , చాగల్లు మండలం లో చాగల్లు నందు , తాళ్లపూడి మండలములో అన్నదేవరపేట నందు మండల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జగదాంబ పేర్కొన్నారు. కావున పై ఆట ల పోటీల నందు పాల్గొనుటకు డి.01 . 11. 2021 వ తేదీ లోపు ఆశక్తి కలిగిన క్రీడా కారుల వివరములు పైన తెల్పిన ఇంచార్జ్ ల వారికి తెలియపరచవలెనన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *