-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
-నిఘా అవగాహనా వారోత్సవాలలో భాగంగా ‘‘స్వతంత్ర భారత్ ఏ 75’’పై వెబినార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో నిర్వహిస్తున్న నిఘా అవగాహనా వారోత్సవాలు-2021లో భాగంగా నేడు ‘‘స్వతంత్ర భారత్ ఏ75 : స్వీయ విశ్వాసంతో సత్యనిష్టను కలిగుందాం’’ అనే అంశంపై వెబ్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మల్లేష్ సంకశాల మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యునికేషన్, జర్నలిజం విభాగంలోని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వక్తలుగా పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధ్యక్షతన ఈ సమవేశం జరిగింది. అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సీనియర్ డిప్యుటీ జనరల్ మేనేజర్ & చీఫ్ విజిలెన్స్ అధికారి చంద్రిమా రాయ్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గజానన్ మాల్య ప్రసంగిస్తూ స్వీయ విశ్వాసంతో కూడిన సత్యనిష్ట, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అవసరమని, ఇవి జీవితంలో అన్ని రంగాలలో విజయవంతం కావడానికి తోడ్పడుతుందని అన్నారు. వ్యక్తిగతమైన నమ్మకం, వినయం, అనుసరనీయం మరియు స్వీయ విశ్వాసం కలిగుండి, సంస్థ కోసం స్వీయ విశ్వాస వాతావరణం కలిగుంటే అతను/ఆమెలో బాధ్యతను పెంపొందిస్తుందని అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రవేశ పెట్టిన ఇ-ప్రొక్యూర్‌మెంట్, ఇ-వేలం, ఇ-టెండరింగ్, ఇ-పేమెంట్స్ మొదలగు డిజిటల్ కార్యక్రమాలు అనేక ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాయని అన్నారు. స్వీయ విశ్వాసం మరియు ఆత్మనిర్భరత వ్యక్తిగతంగాను, సంస్థాగతంగా మరియు జాతీయ స్థాయిలలో అందరికీ అనుసరనీయమని ఆయన అన్నారు. వినియోగదారులతో సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రతివారు కచ్చితత్వం మరియు బాధ్యత కలిగుండాలని, ఇది ఏ సంస్థ అభివృద్ధికైనా ఎంతో అవసరమని అన్నారు. ఆయన ఆత్మనిర్భరత ముఖ్యాంశాలను తెలియజేస్తూ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే నిత్యవసరాల సరుకులను నిరంతరం సజావుగా సరఫరా చేసేందుకు తోడ్పడిరదని ఆయన అన్నారు.
శాతవాహనా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మల్లేష్ సంకశాల ప్రసంగిస్తూ సమగ్రత, నైతికత మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడంతో సమాజంలో అవినీతిని అరికట్టవచ్చని, ప్రస్తుత కాలంలో ఇది ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం సామాజిక, సాంస్కృతిక మరియు చట్టపరమైన కార్యకలాపాల ప్రాముఖ్యతను ఆయన ఉద్ఘాటించారు. పాలనలో అందరినీ కలుపుకొని ముందుకుసాగితే స్వీయ విశ్వాసనీయ భారత్‌ను సాధించవచ్చని ఆయన నొక్కిచెప్పారు.
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం అత్యవసరమని అన్నారు. భారత దేశం స్వాతంత్రం పొందినప్పటి నుండి ఆధునిక సాంకేతికతలో ఇతర దేశాలతో సమానంగా కొనసాగుతుందన్నారు. కొన్ని అంశాలలో అగ్రస్థానంలో కూడా ఉందన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలకు చేరుకోవాలంటే మన సొంత సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అన్నారు. పారదర్శకత , విధానాలలో సులభతరం మరియు అవినీతిని అరికట్టడంలో అవగాహన కలిగించడం ఎంతో అత్యవసరమని అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యుటి జనరల్ మేనేజర్ మరియు చీఫ్ విజిలెన్స్ అధికారి చంద్రిమా రాయ్ సమావేశానికి హాజరయిన వారిని సాదరంగా స్వాగతించారు మరియు నిఘా విభాగం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సెమినార్లు మరియు వ్యక్తిగత సంప్రదింపుల నిర్వహణతో ఉద్యోగులలో అవగాహనాను కలిగిస్తున్నట్టు ఆమె తెలిపారు.
వెబ్‌నార్ సమావేశం సందర్భంగా శ్రీ గజానన్ మాల్య విజిలెన్స్ బులెటిన్ ‘‘అనిమిష’’ను విడుదల చేశారు. నిఘా అవగాహనా మరియు జాతీయ సమగ్రతపై నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులను ఆయన అభినందించారు. వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఆరు డివిజన్ల డివిజినల్ రైల్వే మేనేజర్లు మరియు సీనియర్ అధికారులు వీడయో కాన్ఫిరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.