విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ డెభై రెండవ టిబి సీల్ సేల్ క్యాంపెయిన్‌ను శుక్రవారం ప్రారంభించారు. రాజ్ భవన్ దర్బార్ హాల్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టిబి అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి డి.బాలచంద్ర, కార్యక్రమం గురించి వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్ధలం కేటాయింపుకు సహకారం అందిస్తున్న గవర్నర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ కాంతి మొహంతికి ప్రత్యేక ఉత్తమ సంస్థాగత అవార్డును అందజేశారు. మానపల్లిలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డా.బి.వెస్లీకి ఉత్తమ సంస్థాగత అవార్డు, చిలకలూరిపేటలోని ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ సిఓఓ డాక్టర్ మసిలామణికి వ్యక్తిగత పురస్కారం అందించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …