విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటిఎస్) సర్వేను రెండురోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మండల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సర్వే, డేటా ఎంట్రీ అంశాలపై కలెక్టర్ జె. నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటిఎస్ సర్వేను అక్టోబరు 31కి పూర్తి చేసి ఒక పద్దతి ప్రకారం డేటా ఎంట్రీని చేయాలన్నారు. సచివాలయ పరిధిలో సేకరించిన లబ్దిదారుల వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలన్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను వినియోగించుకోవడంతోపాటు అవసరమైతే ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు. సర్వే పూర్తి చేయడంలో డేటా ఎంట్రీ వేగవంతంగా జరిగేందుకు ప్రతీ మండలంలోని తహాశీల్థార్లు ఎంపిడివోలు హౌసింగ్ ఏఇ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇంతవరకు సర్వే నిర్వహించిన డేటా ఎంట్రీ చేపట్టని మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచే పని ప్రారంభించాలన్నారు.లబ్దిదారుల దగ్గర ఇంటికి సంబంధించిన డాక్యూమెంట్లు లేని సమయంలో ఆ వివరాలను హౌసింగ్ అధికారుల నుంచి పొందాలే తప్ప సర్వే, డేటా ఎంట్రీలో జాప్యం చేసేందుకు వీలులేదన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత మాట్లాడుతూ ఓటిఎస్ సర్వే విషయంలో విఆర్‌వోల దగ్గర ఎక్కడ పెండిరగ్ ఉండటానికి ఎంతమాత్రం వీలులేదని స్పష్టం చేశారు. మండలాల్లో ఓటిఎస్ సర్వే డేటా ఎంట్రీపై డివిజనల్ అధికారులు కూడా పర్యవేక్షించాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్, జడ్పీ సిఇఓ సూర్యప్రకాశరావు, డిపిఓ జ్వోతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …