విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ వైద్య అధికారులకు సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక పాత ప్రభుత్వ ఆస్పత్రిని సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టేషన్, వెయిటింగ్ హాల్, వాష్‌ఏరియా, గైనిక్ వార్డ్, స్కానింగ్ కేంద్రం,ప్రసవానంతర వార్డులను సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు, వారిసహాయకులు పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఓపి రిజిస్టేషన్‌లో జాప్యం లేకుండా త్వరితగతిన రోగులకు వైద్యం అందేలా చూడాలన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …