Breaking News

విద్యార్థులూ… మీ విజయం స్ఫూర్తిదాయకం

-పదవ తరగతి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు సత్కారాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులూ… మీ విజయం స్ఫూర్తిదాయకం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు – 2026లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయుల అభినందన సభ ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను భవిష్యత్తు దిశగా మార్గ నిర్దేశకత్వం చేశారు. జిల్లాను గర్వకారణంగా నిలిపారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల ఉన్న అపోహలు అన్నింటికి, అందరికీ సమాధానం మీరే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న అపోహలను పారద్రోలారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలలను దాటి ప్రభుత్వ పాఠశాలలు వెళ్లాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించి మీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, తమ్ములకు, చెల్లెళ్ళకు స్ఫూర్తిని, ప్రేరణను నింపారని అన్నారు. పిల్లల చదువులకు బాగా సహకరించి, గొప్ప విజయాలు సాధించడంలో తోడ్పాటును తల్లిదండ్రులు అందించడం పట్ల అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించడంలో, విద్యార్థులను తర్ఫీదు ఇవ్వడంలో ప్రత్యేక దృష్టి సారించిన ఉపాధ్యాయులను “మీ బోధన, స్పూర్తి గొప్పదని” అన్నారు. “విద్యార్థుల మార్కులు చూస్తే నాకే ఈర్ష్యగా ఉంది” అంటూ, అంతటి మంచి మార్కులు సాధించుటకు కృషి చేసిన
ఉపాధ్యాయులకు సెల్యూట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా
మీరు నమ్మకాన్ని కలిగించారు.. స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు.
“మా అమ్మ ఉపాధ్యాయురాలు” – ఉపాధ్యాయ వృత్తి పట్ల ఎంతో గౌరవం ఉంది, విద్యార్థులు సాధించిన దానికి ఉపాధ్యాయులు నిదర్శనం, పిల్లలు సాక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్యను పొందాలని కోరారు. మంచి పౌరులుగా దేశానికి అందించాలని ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు చేరే రోజు రావాలని ఆకాక్షించారు.

గొప్ప విజయాలు సాధించాలి

“విద్యార్థులు నా కంటే ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని” జిల్లా కలెక్టర్ ప్రేరేపించారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరని, ఇబ్బందులను అధిగమించి లక్ష్యం చేరే వరకు విశ్రమించ వద్దని సూచించారు. “నువ్వు అనుకుంటే ఆకాశాన్ని అందుకోగలవని, నీకు ఎదురులేదని” అన్నారు. ” గొప్ప విజయాలు సాధించి నన్ను కలవాలని” విజ్ఞప్తి చేశారు.

జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా మాట్లాడుతూ జిల్లా నుండి 27,012 మంది పరీక్షలకు హాజరు కాగా 24,011 మందితో 88.89 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 8వ స్థానంలో జిల్లా నిలిచిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *