Breaking News

ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు – సామాన్యుడిపై ధరల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై… : జి.కోటేశ్వరరావు ఆగ్రహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోందని, నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ​​ ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా ధరలు పెంచడం ప్రజలను వంచించడమే అన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయని కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ​గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర గత ఫిబ్రవరితో పోలిస్తే నేడు ఒక్కో సిలిండర్‌పై అదనంగా ₹60 అదనపు భారం పడింది అనిఅన్నారు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరలపై కేంద్రం విపరీతమైన భారం మోపింది. మే 1వ తేదీన ఏకంగా ₹993 పెంచి, ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధరను ₹3,251.50 కి చేర్చారు దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది అని ఇది సామాన్యుని దినాందికా జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని విమర్శించారు.

అంతర్జాతీయ మార్కెట్లో సాకులు చూపుతూ, పేదల పొయ్యిలో నిప్పులు పోసి అదానీ-అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల జేబులు నింపడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ​గుదిబండగా మారి వెయ్యి రూపాయలకు చేరువైన గ్యాస్ ధరతో సామాన్యుడు మళ్ళీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. గతంలో ప్రజలకు అండగా ఉన్న గ్యాస్ సబ్సిడీని నామమాత్రం చేసి, ఇప్పుడు పూర్తిగా ఎత్తివేసే కుట్రను సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

​”అచ్చే దిన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి, సామాన్యుడికి ‘చచ్చే రోజులు’ తెచ్చింది. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుంది.” అని హెచ్చరించారు ​పెంచిన గ్యాస్ ధరలను (గృహ మరియు వాణిజ్య) తక్షణమే ఉపసంహరించుకోవాలి. ​గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించి నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలి. ​పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తెచ్చి నిత్యావసరాల ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు.

​ఈ ధర్నాలో నగర పార్టీ సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, బుట్టిరాయప్ప, కెవి భాస్కరరావు,తాడి పైడియ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, డి.వీ రమణబాబు, తూనం వీరయ్య,బుద్దే రాజా, ఎస్.కే. నజీర్,ఎడ్ల కృష్ణ కిషోర్, ఓర్సు భారతి, ప్రజానాట్యమండలి నాయకులు ఆర్.పిచ్చయ్య, కంచర్ల నాగేశ్వరరావు, ఎర్రసాని జోసెఫ్, కరోతి వెంకటేశ్వరరావు, కొండేటి శ్రీనివాసరావు,బెవర శ్రీనివాసరావు,చిర్ల రామస్వామి, రవికుమార్, శివ, కాళ్ల చిన్నప్ప, మురుగేషన్ రాము,పగిడి కత్తుల రాము,ఎస్కే భాష,మహిళా సమాఖ్య నాయకులు లంక నాగమణి,నక్క రాజ్యలక్ష్మి, శాంత ,సిహెచ్.అనిత, మల్లీశ్వరి, వేలంగిని రాణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజ‌య‌వాడ ఆర్‌డీవోగా వెన్నెల శ్రీను

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ నూత‌న రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) వెన్నెల శ్రీను బుధవారం నగ‌రంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *