-ఎమ్మేల్యే డిఎన్ఆర్
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
అవసరమైన ప్రాంతానికి పటిష్టమైన రహదారి నిర్మాణం శ్రీ పాతాళ భోగేశ్వస్వామి వారి ఆశీస్సులతో నేడు కార్యరూపం దాల్చడం చాలా సంతోషముగా ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
కలిదిండి ఆర్ ఆండ్ బీ మెయిన్ రోడ్డు ఆర్చి నుంచి శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి వారి ఆలయం వరకు 2.8కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డిఎన్ఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక నిర్మాణాలకు దేశంలోనే పేరు పొందిన విశ్వాసముద్ర ఇంజనీరింగ్ సంస్థ కలిదిండి ఆర్ అండ్ బి రోడ్డు నుంచి సంతోషపురం వరకు రూ. 7.40 కోట్లతో 6.65 కిలోమీటర్లు రహదారిని నిర్మాణం చేస్తున్నారన్నారు. పనులు జరుగుతున్న బీటీ రోడ్డులో కలిదిండి మెయిన్ రోడ్డు ఆర్చి నుంచి శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి ఆలయం వరకు సిమింట్ రోడ్డు 5.5. మీటర్ల వెడల్పుతో నిర్మాణం కు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింద న్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులుతో కలిదిండి నుంచి సంతోషపురం వరకు 7 కోట్ల4Oలక్షలు రూపాయలతో 2.80 కిలోమీటర్లు సీసీ రోడ్డు, అదేవిధంగా 3.85కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మండలంలో ఒక ముఖ్యమైన రహదారిగా భవిష్యత్ లో రూపుదిద్దుకోనున్నదన్నారు. ముఖ్యంగా వచ్చే శివరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఈ రహదారి సౌకర్యం మంచి సంతృప్తి నిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రాజెక్టు డీఈఈ రవి కుమార్, పంచాయతీరాజ్ ఏఈ ఫణి, వర్క్ ఇన్స్పెక్టర్ నాని, ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ బొర్రా సత్యవతి, మండల వ్యవసాయం సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, సర్పంచ్ ముత్తిరెడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీలు నీలి సుమన్, మహ్మద్ చాన్ బాషా,కో అప్షన్ సభ్యులు షేక్ అసిఫ్, ఊర శ్రీధర్, వడుపు రామారావు, షేక్ చాన్ బాషా, కందుల వెంకటేశ్వరరావు, తట్టిగోళ్ల నాంచారయ్య, నున్న కృష్ణబాబు, గోదావరి సత్యనారాయణ,బత్తిన ఉమామహేశ్వరరావు, పడవల శ్రీనివాస్, సాన వెంకటరామారావు, నున్న రామచంద్రరావు, ముద్దం రామకృష్ణ, నంద్యాల ఏడుకొండలు, పెరుమాళ్ళ శ్రీను, పెరుమాళ్ళ భోగేశ్వరరావు,గుడివాడ ఫణి, మంగిన భాస్కర్, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.