-జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫీజుల రాయితి కల్పించాలని వినతి పత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితి కల్పించాలనని కోరుతు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ కి వినతి పత్రం సమర్పాంచారు.శనివారం ఓ హోటల్ లో జరిగిన సమావేశానికి కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ ను కలసి ప్రవేటు విద్యా సంస్థల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు నూరు శాతం రాయితి కల్పించాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తు గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితి కల్పించామని గుర్తు చేసుకున్నారు.విద్యాశాఖ డైరెక్టర్ కి లేటర్ రాశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రుల సంక్షేమ సభ్యులు ఎ.వి.వి.శ్రీనివాసరావు, రమేష్ రెడ్డి, ఆలీమ్, సునీల్ , షేక్ నాగూర్ మస్తాన్ , ప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.