విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవం ముగింపు సందర్భంగా సోమవారం ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ నందు అధికారులు మరియు సిబ్బందిచే “పౌరుల సమగ్రతా ప్రతిజ్ఞ” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ పి ఎస్ హాజరయ్యారు. ఈ ప్రతిజ్ఞా కార్యక్రమంలో ప్రధాన కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొనగా, విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎ.డి (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ) శోభా మంజరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) పి. కృష్ణ మోహన్, ఇతర ఉన్నతాధికారులు, సీనియర్ స్కేల్ మరియు జూనియర్ స్కేల్ అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …