Breaking News

కొవ్వూరు పట్టణం.. 23 వ వార్డుకు దాఖలైన నామినేషన్లు తొమ్మిది…

-మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మునిసిపాలిటీ పరిధి లోని 23వ వార్డు కి శుక్రవారం సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు స్వీకరణ పూర్తి అయినదని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. వైఎస్సార్ పార్టీ తరపున రెండు, టిడిపి తరపున మూడు, సిపిఎం తరపున రెండు, బీజేపీ తరపున ఒకటి, జనసేన తరపున ఒక నామినేషన్ దాఖలు చేయ్యడం జరిగిందన్నారు. నవంబర్ 6న నామినేషన్లు పరిశీలిన చెయ్యడం జరుగుతుందని, 8వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ కు మ.3 గంటల వరకు ఉందన్నారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ను 8వ తేదీన ప్రకటిస్తామన్నారు. 15వ తేదీ (సోమవారం) ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్ జరుగుతుందని, ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వొస్తే 16 వతేది రిపోలింగ్ చేపడతారని పేర్కొన్నారు. నవంబర్ 17 వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *