-అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి…
-జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 14వ తేది నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించనున్న బాలోత్సవ్ 2021కార్యక్రమాలను ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులనుఆదేశించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించనున్న బాలల దినోత్సవ ఏర్పాట్లను పై సంబంధిత అధికారులకు శనివారం జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలో ఉత్సహాని నింపే విధంగా సాంసృతిక క్రీడ, డ్రాయింగ్, నృత్యం, సంగీతం, పాటల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పండుగ వాతావరణం నెలకొల్పేటట్లుగా ఫుడ్ కోర్ట్ తో పాటు ఫ్లవర్ షో, పెట్ షో, వివిధ రకాల అమ్యూజ్ మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. అదే విధంగా మ్యాజిక్ షో, పపెట్ షోతో పాటు వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేసి పిల్లలో ఆనందాన్ని నింపేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు పిల్లలను పంపి ఈ బాలల దినోత్సవాని విజయవంతం చేయాలన్నారు. అధికారులు ఎవరికి కేటాయించిన విధులను వారు భాధ్యయతయుతంగా నిర్వహించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ వెంట డిఇఓ తహేర సుల్తానా , ఏపిసి సమగ్ర శిక్ష అభియాన్ శేఖర్, డిడి బిసి వెల్ఫేర్ లక్ష్మి దుర్గ, డిడి సాంఘిక సంక్షేమ శాఖ సరస్వతి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఇంచార్జ్ నాగదివ్య, ఐసీడీఎస్ పిడి ఉమాదేవి తదితర అధికారులు ఉన్నారు.