Breaking News

హాజీలకు రూ. 3.31 కోట్లు చెల్లింపు

-విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లిన యాత్రికుల అకౌంట్లకు జమ
-హజ్ యాత్రికులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
-యాత్ర విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన హాజీలు
-హజ్-2027 కు దరఖాస్తు చేసుకోండి
-మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లి విజయవంతంగా యాత్ర పూర్తి చేసిన హాజీ లకు రూ. 3.31 కోట్లు మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్లకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి ) విధానంలో జమ చేసినట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రెండు దశల్లో వెళ్లిన 331 మంది హాజీ లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని హాజీల అకౌంట్లకు ప్రభుత్వం జమ చేసినట్లు బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.హజ్ యాత్ర -2026 కోసం ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు 2000 మంది యాత్రికులు బయలుదేరి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రంను ఆప్షన్ గా ఎంచుకొని వెళ్లిన వారందరికీ ఒక్కొకరికి రూ. లక్ష ఆర్థిక సాయంను అందించడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. హజ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కార్యాచరణ బద్ధంగా ఇక్కడి నుండి అక్కడికి వెళ్లేంతవరకు, యాత్ర ముగించుకొని అక్కడినుండి ఇక్కడికి చేరేంతవరకు మైనారిటీ సంక్షేమ శాఖ, అనుబంధ శాఖలు సమిష్టిగా నిరంతరం పర్యవేక్షించడం జరిగిందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. హాజీలందరూ విజయవంతంగా యాత్ర ముగించుకుని తిరిగి వచ్చారని, ప్రభుత్వ ఏర్పాట్లను ప్రతి హాజీ మెచ్చున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చిత్త శుద్ధితో పనిచేస్తుందని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు.హజ్ యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

 

హజ్-2027 కు దరఖాస్తు చేసుకోండి
=============
పవిత్ర హజ్ యాత్ర -2027 కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20 తేదీ వరకు గడువు నిర్దేశించబడిందని, గడువుకు ముందే దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు.భారత ప్రభుత్వం, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ముంబై, హజ్–2027 యాత్రకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ 22-06-2026 నుండి ప్రారంభమైందన్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 20-07-2026 అయినందున యాత్రకు వెళ్లాలనుకునేవారు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఆన్‌లైన్ దరఖాస్తుకు తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌తో తీసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువు జిరాక్స్ కాపీ,హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే యాత్రికుల పాస్‌పోర్ట్ కనీసం 31 డిసెంబర్ 2027 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలని, సంబంధిత వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. హజ్–2027 యాత్ర చేయాలనుకునే రాష్ట్రంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు అందరూ విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ ఎన్నుకుని ప్రభుత్వమిచ్చే ఆర్థిక సహాయం లక్ష రూపాయలను వినియోగించుకోవాలని కోరారు. చివరి తేదీకి ముందుగానే తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా తమ హజ్ యాత్రను సురక్షితంగా, సక్రమంగా నిర్వహించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్ఎండి ఫరూక్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *