అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యముల పాఠశాలలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరికీ తెలియచేయునది ఏమనగా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 నకు ఎంపిక చేయుటకు గాను మార్గదర్శకాలు మరియు Timelines రాష్ట్రం లోని RJDSE లకు , జిల్లా విద్యాశాఖాధికారి మరియు Additional Project Coordinators of SS లకు తెలియజేయడం జరిగింది. దీనిలో 3 రకాలుగా ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరుగుతుంది. 1) Self Nomination – Each Category one 2) Recommended by 05 Fellow Teacher మరియు 3) Performance-based selection through LEAP App.
అర్హతలు:
ప్రైవేట్ యాజమాన్యములు తప్ప అన్ని యాజమాన్యములలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు అర్హులు.
కనీసం పది (10) సంవత్సరముల సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి.
కావున, అర్హత కలిగిన ఉపాధ్యాయులు 01.07.2026 నుండి 15.07.2026 లోగా ఆయా డివిజన్ ఉప విద్యాశాఖాధికారుల కార్యాలయములలో దరఖాస్తులు సమర్పించవలసినదిగా పాఠశాల విద్యా శాఖా డైరెక్టర్, తమీమ్ అన్సారియా, IAS తెలియచేసియున్నారు.
Tags amaravathi
Check Also
ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …
Prajavartha Online Telugu News