విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ భవానీపురం ,ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు , మహ్మద్ అబ్దుల్ ఖాదర్ కూటమి నేతలతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మహాదేవు అప్పాజీరావు తెలిపారు. ఎం ఆర్ పీ ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మానికొండ శ్రీధర్ , జనసేన పార్టీ 39 వ డివిజన్ అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News