Breaking News

హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతులు కల్పించిన ఆర్‌జేటీసీ వడ్డే సుందర్

-ఆర్‌జేటీసీకి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు ఎం. రాజుబాబు, రామాంజనేయులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జోన్–II పరిధిలో ఖాళీగా ఉన్న రవాణాశాఖ హెడ్ కానిస్టేబుల్స్ పోస్టులకు కానిస్టేబుల్స్‌ను హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించినట్లు రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఆర్‌జేటీసీ) వడ్డే సుందర్ తెలిపారు.

స్థానిక బందరు రోడ్డులోని ఆర్‌జేటీసీ కార్యాలయంలో శనివారం నాడు ఆయన పదోన్నతి ఉత్తర్వులను కానిస్టేబుల్స్ కు అందజేశారు. ఈ సందర్భంగా వడ్డే సుందర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన వారిలో ఈ ఏడాదే పదవీ విరమణ పొందనున్న కానిస్టేబుల్స్ కూడా ఉన్నారని, వారికి హెడ్ కానిస్టేబుల్స్‌గా పదవీ విరమణ చేసే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. వి. బాలకోటేశ్వరరావును మచిలీపట్నంకు, కె. సుబ్బారెడ్డిను విజయవాడకు , ఎన్. వెంకటేశ్వరరావును విజయవాడకు, బి. నాగేశ్వరరావు ను ఏలూరుకు,ఎస్. సుబ్బారావు ను విజయవాడకు, ఎ. హనుమంతరావును రాజమండ్రికు, ఎ.ఆర్.వి.సి.హెచ్. రాజును కాకినాడ కు పదోన్నతులు కల్పించడం జరిగిందన్నరు. ఉద్యోగుల సంక్షేమం పట్ల నా బాధ్యతగా పదోన్నతులుపై
నిర్ణయం తీసుకున్నానని అయన తెలిపారు. అధికారులుగా, ఉద్యోగులుగా తమ వంతు చెయ్యగలిగిన సహాయం ఇతరులకు చేయాలన్నారు, మనం ఇతరులకు చేసిన మేలు తిరిగి మనకూ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఐన మళ్లీ పుడతామ ఏంటి అని సరదాగా మాట్లాడారు ,

గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ పదోన్నతులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేయడం వల్ల పదోన్నతులు పొందిన వారిలో నూతన ఉత్సాహం నెలకొందని, ఆర్ జేటీసీ గా వడ్డే సుందర్ బాధ్యతలు తీసుకున్న తక్కువ వ్యవధిలోనే అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు కల్పించడం పట్ల ఆర్‌జేటీసీ వడ్డే సుందర్‌కు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎం. రాజుబాబు మాట్లాడుతూ, జోన్–IIకు ఆర్‌జేటీసీగా వడ్డే సుందర్ రావడం ఇక్కడి ఉద్యోగుల అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గత మే నెలలో జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జోన్లలో సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, జోన్–IIలో మాత్రమే వాటిని పూర్తి చేయడం ఆర్‌జేటీసీ వడ్డే సుందర్ చొరవకు నిదర్శనమని అయన కొనియాడారు. ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సామర్థ్యం పెంపు దిశగా ఆర్‌జేటీసీ వడ్డే సుందర్ గారు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని వారు కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇదే విధమైన సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుళ్లందరికీ ఆర్‌జేటీసీ వడ్డే సుందర్ , సంఘ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌జేటీసీ కార్యాలయ ఉద్యోగి కె.ఆర్. శ్రీకాంత్, పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్స్, రవాణాశాఖ ఉద్యోగులు, కానిస్టేబుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *