విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేదల హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందారని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. శనివారం విద్యాధరపురం వి.ఎం. రంగా జంక్షన్ సొరంగం డౌన్ వద్ద స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో రంగా 79వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాపు నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి భారీ కేక్ కోసి స్వర్గీయ మోహనరంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో భాగంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన నాయకుడు రంగా అని కొనియాడారు. ఆ మహానీయుడికి కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని భావోద్వేగానికి లోనయ్యారు. రంగా ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా జయంతి వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ వి ఎం రంగా చౌక్ లో వంగవీటి మోహనరంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ఆయన జయంతి సందర్భంగా ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యి పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశామని తెలియజేశారు.
ఈ వేడుకల్లో ఏపీ పొల్యూషన్ బోర్డ్ మెంబర్ పంచకర్ల సందీప్, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె.నాగుల్ మీరా, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు తదితరులు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత గునుకుల పుల్లయ్య, మిరియాల వెంకటేశ్వరరావు, సుంకర కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మహదేవు అప్పాజీరావు, మరుపిళ్ల రాజేష్, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), గుడివాడ నరేంద్ర రాఘవ, జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన రాష్ట్ర నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, లింగం శివప్రసాద్, కె.యస్.ఎన్, మూర్తి,అక్కల గాంధీ, ఏలూరు శరత్, పేటేటి నాంచారయ్య, బావిశెట్టి, శ్రీనివాస్,బొమ్ము గోవిందమ్మ సంభన బాబురావు గన్ను శంకర్,తమ్మిన లీలాకుమార్,తో పాటు పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News