విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ 302 డిస్ట్రిక్ట్ వారు 2026-27 సంవత్సరానికి గాను అధ్యక్షులు, కార్యదర్శి ఎన్నుకోవడం శనివారం గుణదలలోని రోటరి హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ ఉష పంతుల పాల్గొన్నారు. సభ్యులందరు ఏకగ్రీవంగా జి.శ్యామల ని అధ్యక్ష్యులుగాను, వి.యల్ సరోజ ని కార్యదర్శిగాను ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం జి.శ్యామల మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను నన్ను అధ్యక్ష్యురాలిగా
ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులందరికి ధన్యవాదాలను తెలిపారు, ఇన్నర్ వీల్ లక్షాలైన సేవ,
స్నేహం అని వీటిని ధ్యేయంగా పెట్టుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని క్లబ్ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళదామని ఆమె అన్నారు. ఈ సేవా కార్యక్రమాలలో ముఖ్యంగా పిల్లలకు, యువతకు, మహిళలకు, వృద్ధులకు సకహారంగా ఉండేలా రూపకల్పణ చేస్తున్నామని ఆమె అన్నారు.
క్లబ్ కార్యదర్శి వి.యల్ సరోజ మాట్లాడుతూ ప్రస్తుతం మా ముందు మహిళల కొరకు కుట్టు మిషన్ శిక్షణా తరగతులను, మున్సిపల్ పాఠశాలలో సురక్షిత మంచినీరు అందించాలనే రెండు మెగా ప్రాజెక్ట్ లు మా ముందు ఉన్న మొదటి పనులు అని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ.పి.పి యల్. శ్రి గంగ, ఉపాధ్యక్షులు పి.డి.సి జి.రశ్మి, కోశాధికారి పి.పి.బి సునంద, ఐ.యన్.ఒ అజెయ జైన్, ఎడిటర్ పి.వాణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News