Breaking News

ఈనెల 6 న ఆర్టీసి జేఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కీలక సమావేశం నిర్వహించిన జేఏసి నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఏపిపిటిడి(ఆర్టీసి) ఉధ్యోగసంఘాలు జేఏసి గతనెల 11 న ఇచ్చిన నోటీసుపైన మొదటి దశ ఆందోళణాకార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండవదశ ఆందోళణాకార్యక్రమాలు ఈనెల 7/8 తేదీల నుండి ఆర్టీసి పరిరక్షణ ధినం పేరుతో డిమాండ్సు బ్యాడ్జీలు దరించి డిమాండ్లను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేలా విధులుకు హాజరయ్యే కార్యక్రమానికి ఇప్పటికే ఆర్టీసి జేఏసి నాయకులు పిలుపునిచ్చారు.

ఈదశలో ఆర్టీసి మేనేజ్ మేంటు సోమవారం మధ్యహ్నాం 3. 00 గంఃలకు ఆర్టీసి హౌస్ లో జరిగే చర్చలకు రావాలని ఈసమావేశానికి టిఆర్&బీ స్ఫెషల్ ఛీఫ్ సెక్రటరీ .యం.టి.కృష్టబాబు, ఆర్టీసి వీసి&యం.డీ .ఎన్. బాలసుబ్రమణ్యం తో పాటుఆర్టీసిఉన్నతాధికారులు హాజరౌతున్నందున ఆర్టీసి జేఏసి గా ఇచ్చినడిమాండ్లుపై ఆదివారం ఆడియో కాన్పరెన్సు ద్వారాJAC కన్వీనర్లు, కో-కన్వీనర్ల సమీక్ష సమావేశం నిర్వహించామని ఈసమావేశము లో సోమవారం చర్చించాల్సి ప్రధాన అంశాలపైన,ఈనెల 7/8 తేదిలనుండి ప్రకటించిన ఉద్యమకార్యచరణనువిజయవంతం చేసేందుకు తీసుకున్నచర్యలుపైన చర్చించుకున్నామని ఆర్టీసి జేఏసికన్వీనర్లువై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనద్వారా తెలియజేసారు.

సోమవారం జరగనున్న జెఏసి సమావేశంలో ఆర్టీసీని బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని,ప్రైవేట్ విద్యుత్ బస్సుల ప్రవేశాన్ని విరమించి, ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సుల నిర్వహణ చేపట్టాలని “స్త్రీ శక్తి” వంటి సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన మేర బస్సుల సంఖ్యను పెంచాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి,ఉద్యోగులపైపెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని అలాగే మెమోరాండంలో పొందుపర్చిన సుమారు 30 అంశాలపై చర్చించాలని నిర్ణయించామని వారు తెలిపారు.
ఈసమావేశంలో జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు తోపాటు కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, సి.హెచ్.సుందరయ్య, కట్టాసుభ్రమణ్యం, యస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కే.సూర్యప్రకాశరావు, డి.మాల్యాధ్రి లు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *