అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఈనెల 6వ తేదీ నుండి 8వ తేది వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు.ఈప్రత్యేక శిబిరాన్ని 6వ తేది సోమవారం ఉ.10.30గం.లకు ఎపి సచివాలయం మూడవ భవనం అప్సా(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం) హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, సాయి కాంత్ వర్మ తదితరులు పాల్గోనున్నారు.
ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్ సబ్ మిషన్,కొత్త ఓటర్లు ఎన్రోల్మెంట్, ఓటర్ల జాబితా నుండి చనిపోయిన వారి పేర్లు తొలగింపు,చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు.
కావున ఉద్యోగులు 2002 నాటి ఓటరు వివరాలు,తాజా ఫోటో, ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ వివరాలతో హాజరు కావాల్సి ఉంటుంది.
Prajavartha Online Telugu News