విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎ.పి.విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ (APVTUSC) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా జూలై 18, 19 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాల్సిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి సమస్యలపై వినతిపత్రం ఇవ్వటమైనది ప్రభుత్వం ధృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరటమైనది.
ఉద్యోగులందరికి వెంటనే మెరుగైన పిట్ మెంట్ తో PRC ప్రకటించి అమలు చేయాలి, 4DA లు వెంటనే విడుదల చేయాలి, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరిని సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయాలి, పీస్ రేట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలి, JLM కన్వర్షన్స్ అయిన కార్మికులందరికీ ALM ప్రమోషన్లివ్వాలి, 2008 ముందు జాయిన్ ఉద్యోగులందరికీ EPF హయ్యర్ పెన్షన్ అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి, సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి, విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి 24/7 వినియోగదారులకు సేవలందిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వీడి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు, కార్మికులు డిమాండ్ చేయటమైనది. ఈ కార్యక్రమంలో ఎ.పి.పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యం.మోహన్ రావు, నాయకులు రవీంద్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.అనిల్ కుమార్, ఎపి ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్.కే.షంషేర్ వలి తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News