Breaking News

ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఇన్సెంటివ్స్, సబ్సిడీలు సకాలంలో విడుదల చేయాలి…

-భరోతు రమేష్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్, సబ్సిడీలు సకాలంలో విడుదల చెయ్యాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ శనివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ భరోత్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి మా పరిశ్రమకు వేతలకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఇన్స్టిట్యూట్ సబ్సిడీలు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అన్నారు. ఒక సంవత్సరంలో విడుదల కావాల్సిన ఇన్సెంటివ్స్ ఐదు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తిగా అందలేదు. దీంతో వందలాది పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. మరెన్నో పరిశ్రమలు మూతపడే అంచున ఉన్నాయి. బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ ఒత్తిళ్లు, వడ్డీ భారం తట్టుకోలేక కొంతమంది పారిశ్రామికవేత్తలు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి తెలిపారు.
ఈ సమస్యలపై గత ఏడాది కాలంగా మేము ధర్నాలు, ర్యాలీలు, వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన హామీ గానీ, శాశ్వత పరిష్కారం గానీ లభించలేదు. గత సంవత్సరం ప్రభుత్వం సుమారు రూ.1,500 కోట్ల ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే అందులో సుమారు రూ.250 కోట్లను మాత్రమే విడుదల చేశారు. ఆ నిధుల పంపిణీలో కూడా పారదర్శకత, సీనియారిటీ, ప్రాధాన్యతా క్రమం పాటించకుండా కొందరికి 20 శాతం, మరికొందరికి 40 శాతం చొప్పున చెల్లింపులు చేసి, చాలామందికి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గందరగోళం, అసంతృప్తి నెలకొంది. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా మేము చేపట్టిన ధర్నా ఉద్యమం ఫలితంగానే అందరికీ కనీసం 20 శాతం చెల్లింపులు జరిగాయి. అయినప్పటికీ మిగిలిన 80 శాతం బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సుమారు రూ.780 కోట్లకు పైగా ఇన్సెంటివ్స్ బకాయిలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మరిన్ని పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. ఈ ఆలస్యం కారణంగా వందలాది పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయి. దాదాపు 8,000 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలు మాత్రమే కాదు, వారిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు రెండు లక్షల కుటుంబాల జీవనోపాధి కూడా తీవ్రమైన సంక్షోభంలో పడింది. సబ్సిడీలు సకాలంలో అందకపోవడంతో ఈ కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మా విజ్ఞప్తి ఒక్కటే. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి పెండింగ్‌లో ఉన్న అన్ని ఇన్సెంటివ్స్, సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి. ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను నిర్ణీత గడువులోనే విడుదల చేసే విధానాన్ని అమలు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు బలోపేతం అయితే కొత్త పరిశ్రమలు ఏర్పడతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది పడుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. మేము ప్రభుత్వం వద్ద ప్రత్యేక హక్కులు అడగడం లేదు. మాకు చట్టబద్ధంగా రావాల్సిన ఇన్సెంటివ్స్‌ను సకాలంలో విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.780 కోట్ల బకాయిలను విడుదల చేసి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ వేదిక ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమస్యల పరిష్కారం కోసం గత 18 రోజులుగా మేము నిరవధిక ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అందువల్ల ఈ నెల 20వ తేదీ, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాకు పిలుపునిస్తున్నాము. రాష్ట్రంలోని 8,000 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలు, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు, అలాగే న్యాయం కోరే ప్రతి ఒక్కరూ ఈ మహాధర్నాలో పాల్గొనాలని కోరుతున్నాము. రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఈనెల 20వ తారీకు సోమవారం ఉదయం 8:00 గంటలలోపు మంగళగిరిలోని నేతన్న సర్కిల్‌కు చేరుకుని మహాధర్నాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మన హక్కుల సాధన కోసం అందరం ఐక్యంగా ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భరోతు రమేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ సభ్యులు పద్మ, శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *