Breaking News

ప్రపంచ జనాభా దినోత్సవం-2026 సందర్భంగా కుటుంబ నియంత్రణ లబ్ధిదారులకు లక్కీ డ్రా

-విజేతలకు ఒక్కొక్కరికి రూ.5,000 నగదు ప్రోత్సాహకం
-జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జనాభా దినోత్సవం-2026 సందర్భంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరం నందు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక లక్కీ డ్రా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ అనేది కేవలం జనాభా నియంత్రణకే పరిమితం కాకుండా తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణకు, కుటుంబ ఆర్థికాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు ఎంతో కీలకమని అన్నారు. శాశ్వత కుటుంబ నియంత్రణతో పాటు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన పిపిఐయుసిడి, అంతరా ఇంజెక్షన్ వంటి ఆధునిక పద్ధతులను ప్రజలు విస్తృతంగా వినియోగించాలని సూచించారు. అర్హులైన దంపతులు ప్రభుత్వ వైద్య సంస్థల్లో అందుబాటులో ఉన్న కుటుంబ నియంత్రణ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జూలై 11, 2026న ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న అర్హులైన దంపతులు, ప్రసవానంతరం పిపిఐయుసిడి వేయించుకున్న లబ్ధిదారులు, అంతరా ఇంజెక్షన్ వినియోగించిన మహిళలలో లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రజల్లో ప్రోత్సహించడంతో పాటు, చిన్న కుటుంబం – సంతోషకరమైన కుటుంబం అనే భావనను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న లబ్ధిదారుల విభాగంలో విజేతలుగా రాణిగారి తోట యుపిహెచ్సి పరిధిలోని తమ్మిశెట్టి మల్లేశ్వరి, గిరిపురం యుపిహెచ్సి పరిధిలోని షేక్ నజియా, విజయవాడ రూరల్ పరిధిలోని భవారి అంజలి విజేతలుగా నిలిచారు.

పిపిఐయుసిడి వేయించుకున్న లబ్ధిదారుల విభాగంలో సింగ్ నగర్ పరిధిలోని కె.తేజావతి, క్రీస్తురాజపురంకి చెందిన డి.మరియమ్మ విజేతలుగా నిలిచారు.

అంతరా ఇంజెక్షన్ వినియోగించిన లబ్ధిదారుల విభాగంలో ఇబ్రహీంపట్నం పరిధికి చెందిన జి.సాగర రాణి, కొండూరు పరిధికి చెందిన కె.నరసమ్మ విజేతలుగా నిలిచారు.

చివరిగా కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారం గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.శ్రావణబాబు, ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమ జిల్లా అధికారి డా. సుమన్, జిల్లా గణాంక అధికారి, వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *