మంగళగిరి/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయ అకాడమీ, భోపాల్ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారి ఆదేశాల మేరకు అనంతపురము, కడప, కృష్ణా, కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన 45 మంది స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ వారికి రెండు రోజుల అవగాహన కార్యక్రమం శుక్రవారం మంగళగిరిలో గల ఆంధ్రప్రదేశ్ న్యాయ అకాడమీలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ న్యాయ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ అవధానం హరి హరనాధ శర్మ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోపన్యాసం చేశారు. విలువైన సూచనలు చేయటం ద్వారా, శిక్షణకు వచ్చిన వారిలో సరికొత్త ప్రేరణ కలిగించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని సాధ్యమైనంత మేరకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ఎఫ్.ఎ.సి. డైరెక్టర్ ఎల్. శ్రీధర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమ నిర్వహణకు నిశితమైన మార్గదర్శకత్వం అందించినందుకు హైకోర్టుకు, పాట్రన్-ఇన్-చీఫ్-కమ్-చీఫ్ జస్టిస్ కి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షులకు మరియు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులకు రెండవ తరగతి ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల నియామక వ్యవహారాలు చూస్తున్న గౌరవనీయ న్యాయమూర్తుల కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీకి చెందిన పి. కేశవాచార్యులు సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్., డా.వై. బిందు మాధవి, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్- 11; మరియు పరిపాలనా అధికారి ఎం. శ్రీను పాల్గొని శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News