Breaking News

విమర్శ అవసరమే … నింద … పనికిరాదు…

-గ్రంధావిష్కారణ … సాహితి పురస్కారప్రదాన సభలో డాక్టర్ వృషాదిపతి..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ అంశంలో అయిన .. ఏ పనిలో అయిన సున్నిత విమర్శ అత్యవసరం … దీని వల్ల భవిష్యత్లో సరిదిద్దుకునే అవకాశం కల్గుతుంది … అయితే పనిగట్టుకుని నిందించడం సరికాదని ప్రముఖ సాహితివేత్త డాక్టర్ మొవ్వా వృషాదిపతి అన్నారు ..ఎపిఎస్ ఆర్టిసి ఎం.డి సి హెచ్ ద్వారకా తిరుమలరావు సహోదరి రచయిత్రి డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ రచించిన “విమర్సనాలోకనం “ గ్రంధావిస్కరణ సభ శుక్రవారం సాయంత్రం గుంటూరు బృందావనగార్దేన్స్ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది . ఈ సందర్బంలో ద్వారకతిరుమలరావు తండ్రి గారు సి హెచ్ లక్ష్మినారాయణ పేరిట ఏర్పాటైన స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితి విమర్శకులు ఆచార్య రాచెపాలెం చంద్రశేఖరరెడ్డికి అందచేసారు .డాక్టర్ సి హెచ్ ప్రసూనంబ ,డాక్టర్ కే.కిశోర్ ప్రసాద్ లకు గ్రంధాన్ని అంకితం చేసారు. ఈ సభలో అజో … విభో…కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారయణ , ప్రముఖ రచయిత వల్లూరు శివప్రసాద్ ఎక్షైస్ శాఖ డిప్యూటీ కమీషనర్ జి .కోటేశ్వరరావు ,కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేస్వర్లు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓరుగంటి వెంకటరమణ గారు మరియు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *